ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఈరోజు..నేతలంతా బిజీ బిజీ గా ప్రచారం తో చివరిసారిగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శనివారం తిరుపతి(Tirupathi)లో కూటమి అభ్యర్ధికి మద్దతుగా రోడ్ షో చేసారు. ఈ రోడ్ షో లో టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , జనసేన నేత నాగబాబు సైతం హాజరయ్యారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..ఏపీలో కూటమి పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జగన్ ఒక మాఫియా నడుపుతున్నారని.. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా జరుగుతోందని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని..సంక్షేమం, అభివృద్ధి మోడీ నినాదమన్నారు. తిరుపతి కేంద్రంగా లక్ష ఉద్యోగాల కల్పన మా లక్ష్యమని , తిరుపతి స్మార్ట్ సిటీగా ప్రకటించి అభివృద్ధి చేశామన్నారు. తిరుపతి ఎంతో గొప్ప పుణ్య క్షేత్రమని ఆయన అన్నారు. బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని.. సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేశామని చెప్పుకొచ్చారు.
ఇక నారా లోకేష్ మాట్లాడుతూ..టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని, అనేక ప్రశ్రమాలను తీసుకొచ్చామని , నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేసారు. కానీ ఈ జగన్ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని , కొత్త పరిశ్రమలు కాదు ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయేలా చేసాడని విమర్శించారు. అధిక ధరలతో ప్రజల రక్షత తాగుతున్నాడని ఇలాంటి సైకో జగన్ ను తరిమేయాలని ఓటర్లను పిలుపునిచ్చారు.
Read Also : Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి