Choreographer Johnny : నెల్లూరు జనసేన అభ్యర్థిగా జానీ మాస్టర్..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master)..రాజకీయాల్లో (Politics) బిజీ కాబోతున్నారా..? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Fan) కు వీరాభిమానైనా జానీ..ఇక పవన్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena) నేతగా మారబోతున్నారా..? త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024)జనసేన నుండి బరిలోకి దిగబోతున్నారా..? అందుకే గత రెండు రోజులుగా నెల్లూరు లో బిజీ బిజీ గా గడుపుతున్నారా..? నెల్లూరు నుండి జనసేన అభ్యర్థిగా నిల్చుబోతున్నాడా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే యావత్ జనసేన […]

Published By: HashtagU Telugu Desk
Jhani Janasena

Jhani Janasena

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master)..రాజకీయాల్లో (Politics) బిజీ కాబోతున్నారా..? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Fan) కు వీరాభిమానైనా జానీ..ఇక పవన్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena) నేతగా మారబోతున్నారా..? త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024)జనసేన నుండి బరిలోకి దిగబోతున్నారా..? అందుకే గత రెండు రోజులుగా నెల్లూరు లో బిజీ బిజీ గా గడుపుతున్నారా..? నెల్లూరు నుండి జనసేన అభ్యర్థిగా నిల్చుబోతున్నాడా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే యావత్ జనసేన శ్రేణులు , రాజకీయ వర్గాలతో పాటు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ మాస్టర్ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ..అతి తక్కువ టైంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ అగ్ర హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నాడు. అలాంటి జానీ మాస్టర్..గత మూడు రోజులుగా నెల్లూరు లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన జనసేన టికెట్ పై ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. జనసేనకు సంబంధించి ప్రముఖ నేతలందరినీ కలుస్తుండడం.. తాజాగా హరిరామజోగయ్యను కలసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం..నగరంలో జరిగిన అంగన్వాడీల ధర్నాలోనూ పాల్గొని వారికీ మద్దతు తెలుపడం ఇలా ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఆయన అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని అర్ధం అవుతుంది.

నెల్లూరు జిల్లానుంచి జానీ సీటు (Jnasena Nellore Candidate) ఆశిస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు లో జనసేన పార్టీ విషయానికి వస్తే ఇక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఓ గ్రూపు నాయకుడు వైసీపీలో చేరారు. అయినా కూడా రెండు వర్గాలున్నాయి. ఈ దశలో పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలో జనసేన సీటును ఎవరికీ ఇస్తారు..? లేదా టీడీపీ కి ఇస్తారా..? ఒక వేళ జానీ మాస్టర్ పార్టీ లో చేరి నెల్లూరు స్థానం అడిగితే ఇస్తారా..? అనేది చూడాలి.

Read Also : TDP Congress Alliance : కాంగ్రెస్ తో పొత్తుకు బాబు రెడీ ?

  Last Updated: 29 Dec 2023, 08:50 PM IST