జోగి రమేష్ (Jogi Ramesh ) సైలెంట్ అయ్యాడు..ఏపీ ఎన్నికల ఫలితాల ముందు వరకు మీడియా ముందుకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీల పై విమర్శలు , నోటికి ఎంతవస్తే అంత అనేసి జోగి..ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. మూడు సార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన ఒక్కసారి మాత్రమే విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2024లో జగన్ ఆయనను పెనమలూరుకు షిఫ్ట్ చేయగా, అక్కడ ఓటమిపాలయ్యారు. ఓటమితో పాటు తన రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయనలో ఆందోళన ఎక్కువైనట్లు తెలుస్తుంది.
Plane Crash in America : అమెరికాలో మరో విమాన ప్రమాదం..
ఒకపక్క తన కుమారుడిపై ఆరోపణలు, కేసులు, అరెస్టులు, మరోపక్క తనపై కొనసాగుతున్న విచారణలు ఆయనను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసు, టీడీపీ నాయకులపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నించడమే ఇప్పుడు ఆయనను రాజకీయంగా ఇబ్బందుల్లోకి పడేస్తున్న అంశాలు. ఈ కేసుల భయంతోనే ఆయన పూర్తి మౌనాన్ని పాటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. సమయం సందర్భం లేకుండా టీడీపీ, జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన జోగి రమేష్ ఇప్పుడు వైసీపీకి అధికారమే లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా వైసీపీ అధినేత జగన్ ఆయనను మైలవరం ఇన్‌చార్జ్‌గా ప్రకటించినా, ఇప్పటి వరకు ఆయన పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేకపోవడం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి కలిగిస్తోంది. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, రాజకీయ ప్రత్యర్థుల నుండి ఎదురయ్యే ప్రతిస్పందనలు, పార్టీ మారాలా లేక పార్టీలోనే కొనసాగాలా అన్న అస్పష్టతతో జోగి రమేష్ ఇప్పటికి మౌనంగా ఉన్నారు. ఒక దశలో పార్టీ మారతారని ప్రచారం జరిగినా, ఆయన ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. మరి జోగి మౌనవ్రతాన్ని ఎప్పుడు వీడతారో అని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.