AP Jobs : ఆ మూడు ప్రభుత్వ శాఖల్లో జాబ్స్.. భారీగా శాలరీలు

AP Jobs :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ, మత్స్యశాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 09:01 AM IST

AP Jobs :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ, మత్స్యశాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో పలు ఉద్యోగాలను(AP Jobs) భర్తీ చేస్తోంది. అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఓసీలకు 14, బీసీలకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 11 పోస్టులను కేటాయించారు. అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. 01.07.2024 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 దాకా పేస్కేల్ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

మత్స్యశాఖలో..

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో 4 ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. బీసీ-ఏ వారికి 1, బీసీ-డీ వారికి 2, బీసీ-ఈ వారికి 1 పోస్టును కేటాయించారు.  రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.01.07.2024 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. నెలకు రూ. 45,830 నుంచి రూ.1,30,580 దాకా పేస్కేల్ ఉంటుంది.

Also Read : Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..

ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో..

ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో 5 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించాలి. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఓసీ వారికి 01, బీసీ(బీ/ఈ) వారికి 03, ఈడబ్ల్యూఎస్ వారికి 01 పోస్టులను కేటా యించారు. 01.07.2024 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య వయసున్న అర్హులు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. నెలకు రూ.37,640 నుంచి- రూ.1,15,500 పేస్కేల్  ఉంటుంది.

Also Read : Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి