Biryani : బిర్యానీ లో జెర్రీ ని చూసి పరుగులు పెట్టిన కస్టమర్..ఎక్కడో తెలుసా..?

సగం బిర్యానీ తిన్న తరువాత అందులో కాళ్ళ జెర్రీ కనిపించేసరికి తిన్నందంతా బయటకు వచ్చేంత పని అయ్యింది

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 06:29 PM IST

బిర్యానీ (Biryani) అంటే చాలామంది లొట్టలేసుకుని తింటారు. ఆలా తింటుండగా ఒక్కసారిగా బిర్యానీ జెర్రీ కనిపిస్తే ఇంకేమైనా ఉందా..ప్లేట్ అక్కడ పడేసి పరుగులుపెడతారు. తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District )లో అదే జరిగింది. జిల్లాలోని బేస్తవారిపేట జంక్షన్ లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్(Family restaurent) కు ఓ కస్టమర్(customer) వెళ్లాడు. మెనులో బిర్యానీ చూడగానే అబ్బా అనిపించింది..ఇక ఆలస్యం చేయకుండా బిర్యానీ తినాలని ఆర్డర్ ఇచ్చాడు.

ఆలా ఆర్డర్ ఇచ్చాడో లేదో రెస్టారెంట్ సిబ్బంది బిర్యానీ తెచ్చి కళ్లముందు పెట్టారు. ఇక మనోడు ఏమాత్రం ఆగకుండా లొట్టలేసుకుంటూ తినడం స్టార్ట్ చేసాడు. సగం బిర్యానీ తిన్న తరువాత అందులో కాళ్ళ జెర్రీ కనిపించేసరికి తిన్నందంతా బయటకు వచ్చేంత పని అయ్యింది. వెంటనే రెస్టారెంట్ యజమానిని పిలిచి బిర్యానీ లో ఉన్న జెర్రీ ని చూపించి ఆగ్రహం వ్యక్తం చేసాడు. కస్టమర్స్ కు ఇలాంటి ఫుడ్ నా ఇచ్చేది అంటూ ప్రశ్నించారు. వంట చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా అని విరుచుకుపడ్డారు. దీంతో తమ తప్పుకు క్షేమపణలు కోరారు..ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని సదరు కస్టమర్ ను శాంతింప చేసారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాల రెస్టారెంట్స్ లో జరుగుతూనే ఉన్నాయి. వంట చేసే టైములో ఎలాంటి పరిశుభ్రత పాటించడం లేదు..అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఏంవేస్తున్నామో..వంట చేసే టైములో ఏంపడుతున్నాయో అనేది చూసుకోవడం లేదు. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో ఫుడ్ క్వాలిటీ లేకుండా చేస్తున్నారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహారించే రెస్టారెంట్స్ , హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ(Food safety officers) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్న..భయం లేకుండా పోతుంది. మీరు కూడా రెస్టారెంట్ లకు వెళ్ళినప్పుడు కాస్త చూసుకొని తినండి.

Read Also : BRS Menfesto 2023 : తెలంగాణ లో సరికొత్త పథకాలను ప్రకటించబోతున్న కేసీఆర్..