‘Jenda’ : రేపు జరగబోయే టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ పేరు..

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 12:33 AM IST

ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పొత్తులో వెళ్తున్న టీడీపీ – జనసేన (TDP-Janasena) తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు..రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుండగా..ఇప్పుడు జనసేన అధినేత కూడా బాబు తో జత కట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇందులో భాగంగా రేపు (ఫిబ్రవరి 28) టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు ‘జెండా’ (Jenda)గా నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఉమ్మడి జాబితాను రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఈ సభలో పాల్గొనబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈ ఉమ్మడి జాబితా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. టికెట్ దక్కని నేతలు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ లో ఈ అసమ్మతి సెగ అనేది తారాస్థాయికి చేరింది. 175 స్థానాలకు గాను కేవలం 24 స్థానాలకే జనసేన పరిమితం కావడం తట్టుకోలేకపోతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే అధినేత పవన్ కేవలం 24 సీట్లకే పోటీ చేస్తానడం ఫై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేసారు.

Read Also : Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు