ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వరుసగా నేతలు అధినేత కు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే సర్వేల పట్టుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది బయటకు వచ్చారు. ఉన్న కొద్దీ మంది కూడా టైం చూసుకొని బయటకు రావాలని చూస్తున్నారు. ఇక మిగతా చిన్న , చితక నేతలు సైతం అధిష్టాన తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) వ్యతిరేక గళం వినిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని… బీసీలకు నామమాత్రం కూడా అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం జగన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘వైసీపీలో పవర్ కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. ఆ పార్టీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. బీసీలది ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో జగన్ది ఒంటెద్దు పోకడ చాలా బాగా కనిపిస్తోంది. ప్రభుత్వం బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సామాజిక న్యాయం చేయలేదు. బీసీలకు తాత్కాలిక పదవులిచ్చారు కానీ వాటికి పవర్ లేదు. అధికారమంతా కొద్ది మంది దగ్గరే పెట్టుకున్నారు. వైసీపీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో బీసీలకు సరైన గౌరవం, స్వేచ్ఛ, కేటాయించిన అధికారం లేక ఎంతో మంది బీసీలు వైసీపీకి దూరం అవుతున్నారు.
ఈ విషయంలో వైసీపీ పునరాలోచించుకోవాలి. వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పటిష్ఠం కోస పని చేశాను. ఆయన్ను సీఎం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆయన విజయంలో నేను కూడా భాగస్వాముడిని అయ్యాను. కానీ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంది. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జంగా తీవ్ర విమర్శలు చేశారు.
Read Also : Teacher : స్టూడెంట్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి కోర్కెలు తీర్చుకుంటూ అడ్డంగా దొరికిన టీచర్