Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?

ఏపీ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ (Janasena varaahi) త‌న వైపు తిప్పుకుంటున్నారు. పోరాటాలు, ఉద్య‌మాలు లేకుండా జ‌న‌సేన పార్టీని నిల‌బెట్టారు.

  • Written By:
  • Updated On - June 13, 2023 / 01:07 PM IST

ఏపీ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ (Janasena varaahi ) చాక‌చ‌క్యంగా త‌న వైపు తిప్పుకుంటున్నారు. గ‌త ద‌శాబ్దంగా ఎలాంటి పోరాటాలు, ఉద్య‌మాలు లేకుండా జ‌న‌సేన పార్టీని నిల‌బెట్టారు. గ‌త రెండేళ్లుగా పొత్తులు అంటూ జ‌న‌సేన పార్టీని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఉండేలా చేశారు. ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల (Before Elections) సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, పొత్తు లేక‌పోయిన‌ప్ప‌టికీ ఒంట‌రి పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని దిశానిర్దేశం క్యాడ‌ర్ కు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌కు వ‌స్తాయ‌ని సంకేతాలు (Janasena varaahi)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌కు వ‌స్తాయ‌ని సంకేతాలు ఇస్తూ వారాహి (Varaahi varaahi )ఎక్క‌నున్నారు. ఆయ‌న ప్ర‌త్యేక వాహ‌నం వారాహి ద్వారా ప్ర‌చారానికి శ్రీకారం చుట్టునున్నారు. డిసెంబ‌ర్ లో ఎన్నిక‌ల‌కు రెండు రాష్ట్రాల‌కు ఒకేసారి ఉంటాయ‌న్న సంకేతాలను ప‌వ‌న్ క్యాడ‌ర్ కు ఇవ్వ‌డం జ‌రిగింది. మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ లో ప్ర‌త్యేక పూజ‌లు మంగ‌ళ‌వారం ముగియ‌నున్నాయి. పూర్ణాహుతి కార్య‌క్ర‌మం మ‌ధ్యాహ్నం ముగియ‌నుంది. ఆ త‌రువాత వారాహి వాహ‌నాన్ని అన్న‌వ‌రం తీసుకెళ్లి ప్ర‌త్యేక పూజ‌ల‌ను చేస్తారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఉభ‌య గోదావరి జిల్లాల నుంచి బుధ‌వారం ప్రారంభం కానుంది. ఆ సంద‌ర్భంగా అందుబాటులో ఉన్న లీడ‌ర్ల‌తో ప‌వ‌న్ మంగ‌ళ‌గిరి ఆఫీస్ లో భేటీ ఆయ్యారు. వ‌చ్చే డిసెంబ‌ర్లో ఏపీ, తెలంగాణ ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని సంకేతాలు ఇచ్చారు.

అన్న‌వ‌రం ఆల‌యం ద‌ర్శ‌నంకు ప‌వ‌న్  

జ‌న‌సేన షెడ్యూల్ ప్ర‌కారం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తించారు. అన్న‌వ‌రం ఆల‌యం ద‌ర్శ‌నంకు ప‌వ‌న్ (Pawan kalyan) వెళ‌తార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత కోన‌సీమ అంబేద్క‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. దీంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌స్తుతం అక్క‌డ పోలీస్ యాక్ట్ 30 అమ‌లులో ఉంది. ఇదంతా ఒక ఎతైతే, పొత్తుల గురించి ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర సంకేతాలు ఇచ్చారు. ఒక వేళ పొత్తు లేక‌పోయిన‌ప్ప‌టికీ ఒంట‌రి పోరాటానికి సిద్ధంగా ఉండాల‌ని క్యాడ‌ర్క కు(Janasena) దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Janasena : తెలంగాణ‌పై జ‌న‌సేన అధినేత ఫోక‌స్‌.. 26 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ల నియామ‌కం

ప్ర‌త్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదిగిందో, అలాంటి వ్యూహాల‌తో ప‌వ‌న్ (Janasena varaahi ) వెళుతున్నారు. పొత్తుల‌తో జ‌న‌సేన ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో టీడీపీతో పొత్తుకు వెళ్లాల‌ని అడుగులు వేశారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఓటు బ్యాంకు చీల‌కుండా బీజేపీని కూడా క‌లుపుకుని వెళ్లాల‌ని భావించారు. కానీ, ఆ మేర‌కు సానుకూల సంకేతాలు బీజేపీ నుంచి రాలేద‌ని తెలుస్తోంది. అందుకే, ఒంట‌రిగా పోటీకి సిద్ధ‌ప‌డాల‌ని కూడా ప‌వ‌న్ సంకేతాలు ఇస్తున్నారు.

ఒంట‌రిగా పోటీకి సిద్ధ‌ప‌డాల‌ని కూడా ప‌వ‌న్ సంకేతాలు

ఏపీ ప్ర‌భుత్వం మీద అమిత్ షా, న‌డ్డా రెండు రోజుల క్రితం విరుచుకుప‌డ్డారు. ఇదంతా వ్యూహాత్మ‌కంగా బీజేపీ న‌డుపుతోన్న రాజ‌కీయంగా కొంద‌రు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ప‌వ‌న్ కూడా ఏపీ, తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఒకేసారి వ‌స్తాయ‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Also Read : Pawan Phobia: జగన్ కు పవన్ ఫోబియా! నిజాంపట్నం సభలో అరగంట పైగా జనసేనాని గురించే స్పీచ్