Site icon HashtagU Telugu

Janasena Trouble : బీజేపీ ప‌ద్మ‌వ్యూహంలో ప‌వ‌న్

Janasena For AP

Pawan Kalyan's Janasena Problem, Bjp's Problem

జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయ ప‌ద్మ‌వ్యూహంలో(Janasena Trouble) ఉన్నారు. ఆయ‌న బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల వ‌ల‌లో చిక్కుకున్నారు. వాళ్లు ఆడించిన‌ట్టు ఆడుతున్నారు. క‌మ‌ల నాథుల రోడ్ మ్యాప్ ను అనుస‌రిస్తున్నారు. ఆ విష‌యం అర్థం చేసుకున్న జ‌న‌సైనికులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. విడ‌వ‌మంటే పాముకు, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు అన్న‌ట్టు టీడీపీ, బీజేపీ మ‌ధ్య ప‌వ‌న్ ప‌రిస్థితి ఉంది. ఒక వేళ బీజేపీని వ‌దులుకోలేక‌పోతే , రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం క‌ళ్లెదుట క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి వెళితే, ఫ‌లితాలు ఎలా ఉంటాయో ప‌వ‌న్ కు బాగా తెలుసు. అలాగ‌ని, బీజేపీని వ‌దులుకుని వ‌చ్చే ధైర్యం చేయ‌లేక తిక‌మ‌క ప‌డుతున్నార‌ని టాక్‌.

జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయ ప‌ద్మ‌వ్యూహంలో (Janasena Trouble)

వారాహి వాహ‌నంపై చేసిన యాత్ర తొలి రోజుల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ర‌క్తిక‌ట్టింది. ఉత్త‌రాంధ్ర‌కు వెళ్లిన వారాహి యాత్ర‌కు పెద్ద‌గా స్పంద‌న లేద‌ని ఆ పార్టీ లోలోన అంచ‌నా వేసుకుంది. అందుకే, ఆ యాత్ర‌ను కుదించార‌ని వినికిడి. బ్రో సినిమా ఫెయిల్ అయిన త‌రువాత ప‌వ‌న్ మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని తెలుస్తోంది. పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం ఏమిటి? అంటూ త‌మ్ముడు ప‌వ‌న్ కోసం అన్న‌య్య చిరంజీవి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఫ‌లితంగా ఆయ‌న హీరోగా న‌టించిన భోలాశంక‌ర్ బాక్సాఫీస్ ల‌కు ప‌రిమితం అయింది. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా ఆ సినిమా ఆడ‌లేదు. దీంతో మెగా హీరోల (Janasena Trouble) దూకుడు త‌గ్గింది.

సినిమాటిక్ గా రాజ‌కీయాల‌ను ప‌వ‌న్

ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు మోడీ, అమిత్ షాకు చెప్పి అదిచేస్తా? ఇది చేస్తా? అంటూ బీరాలు ప‌లికిన ప‌వ‌న్ చ‌ప్పుడు కాకుండా వారాహి దిగి హైద‌రాబాద్ కు చేరుకున్నారు. తిరిగి ఏపీకి ఎప్పుడు వెళ‌తారు? అనేది తెలియ‌దు. రాబోవు రోజుల్లో సినిమాల‌కు దూరంగా ఉంటానంటూ చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజ‌మేన‌ని, అభిమానులు విశ్వసించారు. సీన్ క‌ట్ చేస్తే, ఎన్నిక‌లు ముగిసిన ఏడాదిలోపే సినిమా షూటింగ్ ల్లో బిజీ అయ్యారు. అదేమంటే, `జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప‌లు వ్యాపారాలు ఉన్నాయి. ఆయ‌న‌కు సంపాద‌న వివిధ రూపాల్లో వ‌స్తుంది. త‌న‌కు సినిమా ఉపాథి `అంటూ చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చింది. ఇప్పుడు రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం (Janasena Trouble) అంటూ పాత స్లోగ‌న్ అందుకున్నారు.

షా, మోడీ ద్వ‌యం ఏ రోజైనా జ‌న‌సేన పార్టీని క‌బ‌ళించే ఛాన్స్

సినిమాటిక్ గా రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ ర‌క్తిక‌ట్టిస్తున్నారు. ఆయ‌న ప‌దేళ్ల క్రితం పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ దానికి పూర్తి స్థాయి నిర్మాణం లేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద గుర్తింపు కూడా లేదు. కేవ‌లం రిజిస్ట్ర‌ర్ పార్టీగా మాత్ర‌మే ఉంది. పైగా ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చందంగా బీజేపీలోకి జ‌న‌సేన (Janasena Trouble) అంటూ ప్ర‌చారం ఉంది. దాన్ని అధిగమించ‌డానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల అడుగుల్లో అడుగు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఉండే షా, మోడీ ద్వ‌యం ఏ రోజైనా జ‌న‌సేన పార్టీని క‌బ‌ళించే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే అభిప్రాయం.

Also Read : Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం

ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌ను కాద‌నుకుని బ‌య‌ట‌కు వచ్చిన మ‌రుస‌టి రోజే ర‌ష్యా ఫైల్స్ క‌దులుతాయ‌ని వైసీపీ చెబుతోంది. ఇప్ప‌టికే ర‌ష్యా ఫైల్స్ కేంద్రం వ‌ద్ద ఉన్నాయ‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ బీజేపీని వ‌దులుకునే సాహ‌సం చేయ‌రు. అలాగ‌ని, బీజేపీతో క‌లిసి వెళితే మాత్రం జ‌న‌సేన గుర్తింపు అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అందుకే, చంద్ర‌బాబు వ్యూహ‌త్మ‌క మౌనం పాటిస్తున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ వేసే గుప్పిగంతుల్ని గ‌మ‌నిస్తున్నారు. ఒక వేళ బీజేపీని వ‌దిలేసి వ‌స్తే 15 స్థానాల వ‌ర‌కు పొత్తు రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బీజేపీకి దూరంగా ఉండాల‌ని టీడీపీ భావిస్తోంది. ఆ క్ర‌మంలో పొత్తుపై ప‌వ‌న్ తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

Also Read : Pawan Kalyan : పదేళ్లు రాజకీయంలో ఉన్నాను.. సీఎంగా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.. పవన్ హాట్ కామెంట్స్..