ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు అభ్యర్థులను ఖరారు చేస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నియోజకవర్గాల వారీగా జాబితాలను రిలీజ్ చేస్తూ ఉండగా..జనసేన – టీడీపీ లు సైతం తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన అభ్యర్థులను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
కృష్ణా జిల్లాలోని పదహారు సీట్లలో 10 సీట్లకు సంబంధించి అభ్యర్థులను దాదాపు ఫిక్స్ చేసారు. కీలకమైన నూజివీడు స్థానాన్ని వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి , విజయవాడ పశ్చిమ సీటు యార్లగడ్డ వెంకట్రావుకు మరో ఐదు స్థానాల్లో పాతవారికే అవకాశం కల్పించారు. అయితే, పదహారు స్థానాల్లో మిగిలిన ఆరు సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీటిలో రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులు అంతర్గతంగా ఖరారైనా.. పొత్తుల నేపథ్యంలో వాటిని పెండింగులో పెట్టారు. టీడీపీ, జనసేన పార్టీలు కృష్ణా జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను చెరొకటి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గుడివాడ నుంచి వెనిగళ్ల రామ్మోహన్, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమామహేశ్వరరావు, పామర్రులో వర్ల కుమార్ రాజా, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్ తాతయ్య టీడీపీ నుండి పోటీ చేయబోతున్నారు. నూజివీడులో టీడీపీ తరఫున ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నిలబడడం ఖరారైంది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేశ్ నిలబడనున్నారని సమాచారం. అవనిగడ్డ, పెడన సీట్లకు టీడీపీ నుంచి ఇన్‌చార్జులుగా మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఈ రెండు సీట్లలో ఒకదానిని జనసేన ఆశిస్తోంది. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ – జనసేన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
Read Also : Ayodhya : అయోధ్య లో రెచ్చిపోతున్న దొంగలు..