Site icon HashtagU Telugu

Janasena : రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన 32 స్థానాలలో పోటీ..?

Janasena Ts Ap

Janasena Ts Ap

ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ (Janasena- TDP) కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరు పార్టీలు కలిసి కార్యాచరణ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. కాగా వచ్చే ఎన్నికల్లో జనసేన 32 స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబదించిన చర్చలు పూర్తి అయినట్లు సమాచారం అందుతుంది. మరోపక్క తెలంగాణ లో కూడా టీడీపీ తో కలిసి జనసేన 32 స్థానాల్లో (JanaSena Party will contest 32 seats) పోటీ చేయబోతోందని అంటున్నారు. అందుకే తాజాగా కాసాని తెలంగాణ (Telangana) లో టీడీపీ 87 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారని అంటున్నారు.

టీడీపీ – జనసేన పార్టీలు కలిసి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన తరఫున పోటీ చేయనున్న 32 మంది అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించేసింది. ఇప్పుడు మిగిలిన 87 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ (TDP) సిద్ధం చేస్తోంది. ఏపీలో కూడా ఇలాగే సీట్ల పంపకం జరిగిందని , తెలంగాణ లో కూడా ఇలాగే జరిపినట్లు తెలుస్తుంది.

ఇక తెలంగాణ లో టీడీపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) కు అప్పగించినట్లు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టీడీపీ అభ్యర్థుల కోసం బాలకృష్ణ ప్రచారం చేయబోతున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కేసుల విషయంలో ఆయన కోర్టుల్లో చేస్తున్న న్యాయపోరాటం సత్వర ఫలితాలను ఇవ్వటం లేదు. ఎప్పటికప్పుడు విచారణ వాయిదా పడుతూ, తీర్పులు ఆలస్యమవుతుంది. ఇటు తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థుల ప్రకటన , ప్రచారం తదితర అంశాలను నేతలతో ములాఖత్ లో చంద్రబాబు వివరిస్తున్నారు.

Read Also : KTR: మంత్రి వేములకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శ