Site icon HashtagU Telugu

Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ పై జనసేన కార్యకర్తల దాడి..?

Janasena Party Activists At

Janasena Party Activists At

జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై జనసేన కార్యకర్తలు (Janasena Party Activists) దాడి చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా శనివారం అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాల్లో బరిలో దిగుతుండగా, జనసేన 24 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే..కనీసం పోటీ కూడా చేయకుండా చేస్తారా..? ఇదేనా ప్రశ్నించడం అంటే అంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఫై , అలాగే జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పార్టీ ఆఫీస్ లలో పవన్ కళ్యాణ్ ప్లెక్సీ లను చించేస్తూ…దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ వస్తున్నారు. మరికొంతమందైతే మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తూ..వైసీపీ లో చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఎల్లుండి తాడేపల్లిగూడెం లో జరగబొయ్యే టీడీపీ- జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ విచ్చేసారు. నాదెండ్ల మనోహర్ ని కలవడానికి జనసేన పార్టీ తణుకు ఇంచార్జి విడివాడ రామచంద్ర రావు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో మరికొంతమంది నాదెండ్ల మనోహర్ పై దాడికి దిగారు. టికెట్ ఇస్తామని మోసం చేస్తావా అంటూ దాడి చేస్తుండడం తో బొలిశెట్టి శ్రీను, కందుల దుర్గేష్ అడ్డుకొని అక్కడి నుండి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికి టికెట్ల విషయంలోనే కాదు అసలు టీడీపీ తో పొత్తు విషయంలోనే పవన్ కళ్యాణ్ అలోచించి ఉండాల్సిందని అంత అంటున్నారు. పవన్ సింగిల్ గా పోటీ చేసిన 40 , 50 సీట్లు ఈజీ గా గెలిచేవారని, కానీ టీడీపీ తో పొత్తు పెట్టుకొని పరువు తీయడమే కాదు..ఇప్పుడు 24 సీట్లు తెచ్చుకొని కనీసం జనసేన శ్రేణులు తలెత్తుకోకుండా చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే..తీరా ఎన్నికల సమయానికి టీడీపీ జెండాలు మోయమని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.

పొత్తు పెట్టుకుంటే సమానంగా టికెట్స్ తెచ్చుకోవాలి కానీ ముష్టి వేసినట్లు టీడీపీ 24 ఇస్తే పవన్ ఎలా తీసుకున్నాడని మండిపడుతున్నారు. ఇలాంటి పార్టీలలో ఉండడం కంటే వైసీపీ లోనే చేరడమే మంచిదని అంటూ వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరి ఈ ఆగ్రహపు జ్వాలలను పవన్ ఎలా శాంతిప చేస్తారో…ఎన్నికల సమయానికి పార్టీలో అసలు కార్యకర్తలు ఉంటారో ఉండరో అనేది కూడా ప్రస్తుతానికి అర్ధం కానీ పరిస్థితి. చూద్దాం ఏంజరుగుతుందో….!!!

Read Also : Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు