Janasena : రేపటి నుండి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో... కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.

  • Written By:
  • Publish Date - July 17, 2024 / 08:14 PM IST

Janasena: జనసేన అధినేత, ఏపి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) అధ్వర్యంలో రేపటి నుండి (జులై 18) 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం(Active Membership Registration Program) జరుగనుంది. క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో… కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం జనసేన(Janasena) పార్టీకి 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. తాజాగా 9 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా రేపటి నుండి జనసేన కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టనుంది. గతంలో సభ్యత్వాల నమోదుకు 15 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు మాత్రమే లాగిన్ ఐడీ ఇచ్చేవాళ్లు. ఈసారి 50 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇస్తున్నారు. కాగా, నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం కస్టపడి పనిచేసిన జనసైనికు వీరమహిళలు పార్టీ శ్రేణులు అందరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ(Badisha Muralikrishna) పార్టీ శ్రేణులకు ఈ మేరకు పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాలుగో విడత జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు ఈ కార్యక్రమం పది రోజులపాటు నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారని మూడు నెలల క్రితమే క్రియాశీలక సభ్యుల సభ్యత్వ గడువు అయిపోయినప్పటికి ఎన్నికల సమయం కావడం తో పార్టీ శ్రేణులని గందరగోళ పరచకూడదని భావించి మూడు నెలలు పాటు వర్తించే రెన్యువల్ రుసుమును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో చెల్లించారాని తాజాగా ఈ ఏడాదికి సంబంధించి క్రియశిలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించనున్నారని 18 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కోసం అహర్నిశలు కస్టపడి పనిచేసిన ప్రతి జనసైనికులు వీరమహిళలలు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవ శాత్తు గాయపడి హాస్పటల్ పాలైతే ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు దురదృష్టవ శాత్తు ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి భరోసా గా 5 లక్షల రూపాయలు అందజేస్తారని కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మురళీకృష్ణ కోరారు.

Read Also: Gabbar Singh : గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తారా..?

 

 

 

 

 

 

 

 

Follow us