AP : ఓటర్ల ప్రేమకు జనసేనాధినేత ఫిదా..

సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections ) ఓటర్లు బ్రహ్మ రథం పట్టడం పట్ల జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫిదా అయ్యాడు. ఓటర్లు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఓటింగ్లో భాగమైనందుకు అభినందనలు తెలిపారు. అలాగే పిఠాపురం లో 81.86 శాతం పోలింగ్ నమోదవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ, ఇతర అధికారులు చేపట్టిన చర్యలను ప్రశంసించారు. ఈ మేరకు లేఖ రిలీజ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియావారు, పౌర సంఘాలవారు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు..’’ అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ లేఖలో పేర్కొన్నారు.

Read Also : AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు

  Last Updated: 16 May 2024, 10:51 PM IST