Janasena : పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు..

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 01:44 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు జనసేన కోసం ప్రాణమైన ఇస్తాం అంటూ చెప్పుకొచ్చిన వారు..ఇప్పుడు జనసేన లోకి ఎందుకు చేరమా అని మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి గతంతో పోలిస్తే గ్రాఫ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామని , జనసేన ను అధికారంలోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకోబోతుందని తెలిసినప్పటి నుండి కాస్త జనసేన హావ తగ్గడం మొదలైంది..టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ అధికారికంగా ప్రకటించేసరికి చాలామంది జనసేన నుండి బయటకు వచ్చారు. సరే పొత్తు పెట్టుకున్న 175 స్థానాల్లో చేరిసగం తీసుకుంటారని మొన్నటి వరకు అంత భావించారు. కానీ నిన్న 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన బరిలోకి దిగబోతుందని తెలుపడం తో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం తన్నుకొచ్చింది. ఆ 24 కూడా పోటీ చేయడం ఎందుకు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. పదేళ్లుగా జనసేన కోసం కష్టపడుతూ వచ్చిన నేతలకు కాకుండా టీడీపీ నేతలకు టికెట్స్ ఇవ్వడం ఫై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

టికెట్లు కాదు ముఖ్యం..అధికారంలోకి రావడం అని పవన్ కళ్యాణ్ చెపుతున్నప్పటికీ..ఆయన మాటలను ఎవ్వరు లెక్కచేయడం లేదు. టికెట్లే లేని చోట ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టికెట్ రాని అభ్యర్థులు, వారి అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లూ కష్టపడితే చివరి నిమిషంలో సైడ్ చేశారంటూ విమర్శిస్తున్నారు. జగ్గంపేట జనసేన టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్య చంద్ర నిన్న రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అచ్యుతాపురంలోని అమ్మవారి ఆలయంలో తన భార్య, అనుచరులతో దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యా రు. సతీమణి, అభిమానులు సపర్యలు చేస్తున్నారు. అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కినుక వహించారు. ప్రస్తుతం పార్టీ నేతలకు అందుబాటులో ఉండని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలో ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసలు టీడీపీ తో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగిన ఈజీ గా 40 స్థానాల్లో విజయం సాధించేవాళ్ళం..అలాంటిది 24 స్థానాలు టీడీపీ ఇస్తే వాటిని పవన్ తీసుకోవడం ఏంటి అని వారంతా మండిపడుతున్నారు. ప్రస్తుతం టికెట్ రాని నేతలే కాదు జనసేన శ్రేణులు కూడా జనసేన కు సపోర్ట్ చేస్తారనేది సందేహం గా మారింది.

Read Also : AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం

Follow us