Site icon HashtagU Telugu

Janasena 2nd List : జనసేన రెండో జాబితా అభ్యర్థులు వీరేనా..?

Janasena

Janasena

రేపు జనసేన రెండో జాబితా (Janasena 2nd List) రిలీజ్ కాబోతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన..బిజెపి , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడం తో సీట్ల పంపకం జరిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో రేపు టీడీపీ – జనసేన రెండో లిస్ట్ ను ప్రకటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. టీడీపీ ఇంకా 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉండగా..జనసేన పోటీచేయబోయే 21 నియోజకవర్గాల్లో ఐదింటిని మాత్రమే పవన్ ప్రకటించారు. ఇంకా 16 సీట్లను ప్రకటించాల్సుంది. దీంతో రేపు రెండో జాబితాను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టతనిచ్చారు. భీమవరం – రామాంజనేయులు, రాజోలు – వర ప్రసాద్, నరసాపురం – బొమ్మిడి నాయకర్ , ఉంగుటూరు – ధర్మరాజు, తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ లను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. చూద్దాం వీరు వారేనా..లేక మారతారా అనేది.

Read Also : Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?