బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని (Funds to AP in Union Budget) అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ‘ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇలా వరుస హామీలు ఇవ్వడం తో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు రూపాయలు కేటాయించిన కేంద్రం, అవసరమైతే పెంచుతామని చెప్పడం సంతోషకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారు. విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను నెరవేరుస్తామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా ఆయన వర్ణించారు. ఎన్డీఏ ఆర్కిటెక్ట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్ర పెద్దలను కలవడం వల్ల ఏపీకి కేంద్ర బడ్జెట్ నుంచి అధిక నిధులు వచ్చాయని పేర్కొన్నారు.
Read Also : Polimera 3 : పొలిమేర 3కి కొత్త కష్టాలు.. మొదటి రెండు భాగాల్లోని సీన్స్‌ని..
