Site icon HashtagU Telugu

MLA Adinarayana Reddy: సిమెంటు పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యే టార్చర్ !

Jammalamadugu Bjp Mla Adinarayana Reddy Cement Industries Ysr District Andhra Pradesh

MLA Adinarayana Reddy: తన నియోజకవర్గం పరిధిలోని రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అల్ట్రాటెక్‌ సిమెంట్‌‌ను అడుగుతున్నారట. ఈ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగుంట్ల, చిలమకూరుల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంబంధీకులకు ఆ సిమెంటు పరిశ్రమ కొన్ని కాంట్రాక్టులను కట్టబెట్టిందట. అయినా అత్యాశతో రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ  ఆదినారాయణరెడ్డి వేధింపులకు దిగుతున్నారని మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి.

Also Read :DC vs RR: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం.. ఈ ఏడాది తొలి సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీ ఘ‌న విజ‌యం!

ఎమ్మెల్యే అనుచరులు ఇలా.. 

‘‘అన్ని రవాణా కాంట్రాక్టులను ఒకరికే ఇవ్వలేం.గతంలో ఒప్పందాలు చేసుకున్నవారు ఉంటారు.వారందరిని తప్పించలేం’’ అని సదరు సిమెంటు యూనిట్ల నిర్వాహకులు చెప్పినందుకు .. వాటికి ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా గత శనివారం నుంచి ఎమ్మెల్యే(MLA Adinarayana Reddy) అనుచరులు అడ్డుకుంటున్నారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఎర్రగుంట్లలో ఉన్న రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఫ్లైయాష్‌ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లైయాష్‌ రవాణా చేయొద్దని  లారీల యజమానులకు అక్కడి పోలీసులు ఆదేశించారట.  ఈ సిమెంట్‌ యూనిట్లకు సమీపంలోని గనుల నుంచి సున్నపురాయిని కూడా సప్లై కాకుండా ఆపుతున్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. సిమెంటు పరిశ్రమల వైపు సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను నిలిపేశారు. వారంతా అక్కడే చెట్లకింద ఉండి పహారా కాస్తున్నారని సమాచారం. దీనివల్ల ఇప్పటికే ఒక సిమెంటు యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయిందట. ఈరోజు నుంచి ఇంకో ప్లాంటులో కూడా ఉత్పత్తి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయట.

Also Read :Blood Pressure: బీపీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే అర‌టిపండు మిస్ కావొద్దు!

రంగంలోకి ఎస్పీ.. ఆదినారాయణరెడ్డి అనుచరులపై కేసులు 

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులపై కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌కు అల్ట్రాటెక్‌ పరిశ్రమ  ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ వెంటనే ఎస్పీ అశోక్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసు బలగాలను పరిశ్రమల వద్దకు పంపి అరాచకాలకు పాల్పడే వారిని అణచివేయాలని ఆదేశించారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయించి మెటీరియల్‌ సరఫరా పునరుద్ధరణకు ఎస్పీ చర్యలు చేపట్టారు. ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు జగదీశ్వర్‌రెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.