ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) బాపట్ల జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల అనంతరం జరిగిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు అకస్మాత్తుగా “జై జగన్” (Jai Jagan) అంటూ నినాదాలు చేయడం షాక్ కు గురి చేసింది. ఒక్కసారిగా అందరి దృష్టి ఆ యువకుడి వైపుకు వెళ్లింది. మొదట కాస్త ఆగ్రహంతోనూ, తర్వాత తన రాజకీయ అనుభవంతోనూ చంద్రబాబు ఈ పరిణామాన్ని చాకచక్యంగా ఎదుర్కొన్నారు.
Jana Reddy : మంత్రి పదవుల రేసులోకి జానారెడ్డి.. ఎవరి కోసం ?
చంద్రబాబు తన ప్రసంగంలో ఆ యువకుడిని ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందిస్తూ.. “కడుపునొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.. లేకపోతే నన్ను కలిసి చెప్పాలి. ఇలా కేకలు వేస్తే, కడుపునొప్పి మరింత పెరుగుతుంది” అంటూ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో చూశానని, రాజకీయ నాయకులు చిన్న విషయాలను పెద్దవిగా మార్చి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. 43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎవరైనా నిలదీయాలనుకుంటే గౌరవంగా వచ్చి తనకు చెప్పాలని, అలా అయితే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇలాంటి పర్వదిన సమయాల్లో రాజకీయ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. “ఇది పవిత్రమైన యజ్ఞం. మద్దతు ఇవ్వలేకపోతే కనీసం గౌరవంగా వ్యవహరించండి. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే, నా ఫిర్యాదు అందించాలనుకుంటే, నేను అందుబాటులో ఉంటాను” అంటూ సభలోని ప్రజల మన్ననలు పొందారు.