Site icon HashtagU Telugu

Delhi Files: జగన్ ఢిల్లీ ఫైల్స్, 26న హస్తిన బాట

Delhi Tour for favour

Jagan's Delhi Files, 26 On Hastina Bata

Jagan’s Delhi Files : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ (Delhi) వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 27న జరిగే అధికారిక జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటారు అనేది సీఎంఓ అధికారికంగా చెప్పే షెడ్యూల్. కానీ, అనధికారిక భేటీలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల తరువాత సౌత్ పాలిటిక్స్ మీద బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పోకడను మార్చడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ముందస్తు అంశం కూడా ఈ సారి ఢిల్లీ (Delhi) పర్యటనతో తేలనుంది.

ఎలాంటి ఇగోలు లేకుండా బీజేపీ స్వయంగా దిగి వచ్చి చేతులు కలుపుతుందని తెలుగుదేశం జనసేన అంచనా. ఇలాంటి పరిణామం మధ్య జగన్ ఢిల్లీ టూర్ ప్రతి సారిలా కాకుండా కొంత ఉత్కంఠ రేపుతోంది.

ఈ నెల 27న ఢిల్లీలోని కేంద్ర విజ్ఞాన్ భవన్ లో నీతి అయోగ్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు వస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఈ మీటింగ్ కోసం జగన్ ఢిల్లీ (Delhi) వెళ్తున్నారు. అయితే ఒక రోజు ముందే అంటే మే 26న ఆయన ఢిల్లీకి వెళ్లడమే కీ పాయింట్. ఆ రోజు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది.

అమిత్ షా తో భేటీ అంటేనే రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ మరుసటి రోజు 27న నీతి అయోగ్ మీటింగ్ తరువాత ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. పోలవరం ప్రత్యేక హోదా సహా విభజన సమస్యల మీద మోడీ షాలతో జగన్ మాట్లాడుతారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని వైసీపీలో ని టాక్.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసీలు ఇచ్చిన తరువాత ఇటీవల జగన్ అమిత్ షాను కలిశారు. కానీ ప్రధానిని కలిసింది లేదు. ఈ సారి మోడీతో జగన్ ఏమి మాట్లాడుతారు ఇద్దరు మధ్య ఎలాంటి చర్చలు సాగుతాయన్నది ఇపుడు ఏపీ రాజకీయ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న అంశం.

కన్నడ ఫలితాలతో బీజేపీ సౌత్ లో ఏ రకంగా ముందుకు కదలబోతోంది బీజేపీ మనసులో ఉద్దేశ్యాలు ఏంటి అన్నది అమిత్ షా మోడీలతో భేటీ సందర్భంగా జగన్ కు సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీలో జనసేన టీడీపీ కూటమిగా ఉండే చాన్స్ ఉంది. దాంతో ఆ కూటమిలో బీజేపీ కూడా చేరవచ్చు అని వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో అలాంటి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? అసలు బీజేపీకి ఆ ఆలోచన ఉందా?ఉంటే ఏ విధంగా చేస్తుంది? అనేది కూడా జగన్ ఈ భేటీ ద్వారా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు బీజేపీ రెడీ అవుతోంది.ఒంటరిగా వెళ్తే దెబ్బ తింటామన్న సందేశాన్ని కర్నాటక ఫలితం అందించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఏపీలో పొత్తును టీడీపీ ఆహ్వానిస్తోంది. వైసీపీ బీజేపీతో తెర వెనక దోస్తీకే ప్రాధాన్యత ఇస్తోంది.

తెర వెనుక వైసీపీకి మద్దతు ఇస్తూ ఎంత వరకూ ఏపీలో రాజకీయంగా ఉనికిని చాటుకోగలమన్న సందేహాలు కమలం పార్టీలో లేకపోలేదు. వైసీపీతో కూడా పొత్తు విషయం చర్చించవచ్చు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓటు బ్యాంక్ మునుగుతుంది. కాబట్టి వైసీపీ పొత్తులకు నో చెబుతుంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీకి సీట్లు కేంద్రంలో తగ్గితే వైసీపీ సాయం చేయవచ్చు. కేంద్రంలో మద్దతు చూసుకుని వైసీపీకి బీజేపీ అండగా ఉంటుందా? లేక తెలంగాణా ఏపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీతో పొత్తుకు ఓకే చెబుతుందా? అనేది ఆసక్తికరం. ఢిల్లీ (Delhi) జగన్ పర్యటన చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని రాజకీయ సర్కిల్స్ లోని అభిప్రాయం. ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:  CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్