Jagan Promises: జగన్ బూటకపు హామీలు: చంద్రబాబు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేరుస్తామన్న సీఎం జగన్ హామీలను బూటకమంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజ్యమేలిందని అన్నారు.

Jagan Promises: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేరుస్తామన్న సీఎం జగన్ హామీలను బూటకమంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజ్యమేలిందని అన్నారు. 99 శాతం హామీలను అమలు చేస్తామన్న జగన్ రెడ్డి వాదనను బూటకమని కొట్టిపారేసిన ఆయన విశ్వసనీయతపై ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర ప్రారంభించే ముందు గతంలో ఇచ్చిన హామీలపై స్పందించాలని డిమాండ్ చేశారు.ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలను మోసం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు.రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల నిధులు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు 15 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను అమ్మవారి పథకానికి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.కేవలం ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రూ.1,14,000 కోట్లు ఇతర పథకాలకు బదిలీ చేశారు. రూ.12 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను జగన్ మోహన్ రెడ్డి దోచుకుని తాడేపల్లి ఇంట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. అమరావతికి కేంద్రం కేటాయించిన రూ.930 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు.

ఐదేళ్లలో వెనుకబడిన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించిన రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. పంచాయతీ నిధులతో గ్రామాల అభివృద్ధికి కేటాయించాల్సిన రూ.12 వేల కోట్లను దారి మళ్లించి తాడేపల్లిలో దాచి ఎన్నికలకు వినియోగించేందుకు సిద్ధమయ్యారు’ అని మాణిక్యరావు అన్నారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం ఉద్దేశించిన అనేక పథకాలను తొలగించారని సూచించారు.

Also Read: AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు