Site icon HashtagU Telugu

AP : రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.20 వేలు ఇస్తాడు – రఘురామ

jagan-will-give-20000-per-vote-raghurama

రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు జగన్..రూ. 10 వేల నుండి రూ.20 వరకు ఇస్తాడని ఆరోపించారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama Krishnam Raju). వైసీపీ పార్టీ నుండి విజయం సాధించిన రఘు రామ కృష్ణం రాజు..ఆ తర్వాత సొంత పార్టీ కే రెబెల్ గా మారిన సంగతి తెలిసిందే. తరుచు జగన్ ఫై , వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై విమర్శలు చేస్తూ రాస్తున్న రఘు రామ..తాజాగా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ను తీవ్రంగా ఖండిస్తూ..ఆయనకు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు.

తాజాగా మరోసారి జగన్ ఫై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. గత ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ..ఇప్పుడు అదే మద్యం అమ్మకాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి 40,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని రఘురామ అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ మోహన్ రెడ్డి చేసిన 40 వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించాల్సిందేనని అన్నారు. అంతే కాదు రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.10 వేల నుండి రూ. 20 వేలు ఇస్తారంటూ ఆరోపించారు.

Read Also : Shubman Gill: శుభ్‌మన్ గిల్ కి మంచి ఛాన్స్.. సచిన్ 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం..!