Site icon HashtagU Telugu

Jagan Video Conference : తుపాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో జగన్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

Jagan Video Conference

Jagan Video Conference

మైచాంగ్ తుపాను (Michaung Cyclone) ఏపీ (AP)ని అతలాకుతలం చేసింది. గత నాల్గు రోజులుగా భారీ వర్షాలతో తీవ్ర నష్టపరించింది. వేలాది ఎకరాలు నీటమునిగాయి. ఎంతోమంది ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో సీఎం జగన్ (CM Jagan) తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ (Jagan Video Conference) ద్వారా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో మాట్లాడారు.

బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో..ఆ తరహా సాయం వారికి అందాలి అని ఆదేశించారు. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయం అందాలని… ఆ దిశగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్‌ బాగా చేశాడన్న మాట వినిపించాలి. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండండి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క‌ చ‌ర్య‌లు, పంట న‌ష్టం త‌దిత‌ర అంశాల‌పై సీఎం ఆరా తీశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్ జి. సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్ కె. విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ సివిల్ సప్ల‌యిస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి. వీరపాండియన్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి. మహమ్మద్‌ దీవాన్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

Read Also : Revanth Reddy: రేవంత్‌ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న సోనియా గాంధీ