Jagan Twist : విశాఖే రాజ‌ధాని వెనుక MLC ఎన్నిక‌ల వ్యూహం! డైవ‌ర్ష‌న్ పాలిట్రిక్స్ !

ఎప్ప‌టిక‌ప్పుడు మైండ్ గేమ్ ఆడుతోన్న వైసీపీ రాజ‌కీయాన్ని(Jagan Twist) అనుకూలంగా మ‌లుచుకుంటోంది.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 06:00 PM IST

ఎప్ప‌టిక‌ప్పుడు మైండ్ గేమ్ ఆడుతోన్న వైసీపీ రాజ‌కీయాన్ని(Jagan Twist) అనుకూలంగా మ‌లుచుకుంటోంది. మూడు రాజ‌ధానులు (Capital) అంటూ గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అప్పులు, ప‌రిపాల‌న‌, రూల్ ఆఫ్ లా, ఘోరాలు, నేరాల గురించి చ‌ర్చించుకోకుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ న‌డుపుతున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంటి స‌మీపంలో అంధ బాలిక‌ను రేప్ చేసి హ‌త్య చేసిన సంఘ‌ట‌న, లోకేష్ పాద‌యాత్ర‌, చంద్ర‌బాబు ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి…ప‌వ‌న్ వారాహి ప‌ర్య‌ట‌న తదిత‌రాల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి తాజాగా మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. అందులో భాగంగా విశాఖ మాత్ర‌మే రాజ‌ధాని అనే విష‌యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయ‌న స్టేట్ మెంట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగేలా వైసీపీ గేమాడింది.

మైండ్ గేమ్ ఆడుతోన్న వైసీపీ రాజ‌కీయాన్ని అనుకూలంగా.(Jagan Twist)

స‌మీప భ‌విష్య‌తులో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ ఎన్నిక‌ల‌ను సెమీ ఫైన‌ల్ గా భావిస్తున్నారు. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఒక మైలురాయిగా మిగిలే అవ‌కాశం ఉంది. పైగా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప‌రిధిలో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌వి. అందుకే, వ్యూహాత్మ‌కంగా మూడు రాజ‌ధానులకు(Capital) బ‌దులుగా విశాఖే రాజ‌ధాని అంటోంది. కేవ‌లం ఒక అసెంబ్లీ సెష‌న్ మాత్ర‌మే అమ‌రావ‌తిలో జ‌రుగుతుంద‌ని స‌రికొత్త ప్ర‌చారానికి తెర‌లేపింది. క‌ర్నూలు గురించి బుగ్గున ప్ర‌స్తావిస్తూ హైకోర్టు అక్క‌డ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల వైసీపీ నేత‌లు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ కోర్టు ధిక్కారం కిందకు వ‌స్తాయి. అయిన‌ప్ప‌టికీ మూడు రాజ‌ధానులు అంటూ సీఎం, కాదు విశాఖే రాజ‌ధాని అంటూ మంత్రులు వ్యాఖ్యానించ‌డం రాజ‌కీయ గేమ్ లో భాగమే.

వ్యూహాత్మ‌కంగా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు..

సీఎం గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Twist) బాధ్య‌త‌లు స్వీక‌రించిన 2019 వ ఏడాది తొలి రోజుల్లో ఇసుక వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దం అయింది. ఆ త‌రువాత మ‌ద్యం వివాదంగా మారింది. ఉపాథి లేక భ‌వ‌న కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్, చంద్ర‌బాబునాయుడు ప్ర‌జా ఉద్య‌మానికి ఆ ఏడాది పునాది వేశారు. అది గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా మూడు రాజ‌ధానుల(Capital) అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అంద‌రి దృష్టీ అమ‌రావ‌తి, మూడు రాజ‌ధానుల మీద ప‌డింది. ఆ లోపుగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను అరెస్ట్ చేస్తే కాలం వెళ్ల‌బుచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌ను, సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ల‌ను, న్యాయ‌మూర్తుల‌ను నిందించ‌డానికి కొంత స‌మ‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కేటాయించింది. ఆ లోపు క‌రోనా రావ‌డంతో పాల‌న మూల‌న‌ప‌డింది.

Also Read : AP Capital : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, తేల్చేసిన కేంద్రం!

కరోనా త‌రువాత రాష్ట్రాల‌న్నీ అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెడుతుంటే, ఏపీ మాత్రం అమ‌రావ‌తి రాజ‌ధానా? విశాఖ‌నా? అనేదానిపై ప్ర‌జ‌లు చ‌ర్చించుకునేలా మాస్ట‌ర్ ప్లాన్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Twist) చేశారు. మూడున్న‌రేళ్ల ఆయ‌న పాల‌న మీద కాకుండా అధికార వికేంద్రీక‌ర‌ణ అంశాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు లైవ్ లో ఉంచుతున్నారు. న్యాయ‌ప‌రంగా రాజ‌ధాని అమరావ‌తిని మార్చ‌డం ఈజీకాద‌ని ఆయ‌న తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఒక రాజ‌కీయ అస్త్రంగా దాన్ని ప్ర‌యోగిస్తున్నారు. సుప్రీం కోర్టు ఫైన‌ల్ తీర్పు ఇచ్చే వ‌ర‌కు అధికారికంగా ఆయ‌న ఒక అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. మూడు రాజ‌ధానుల బిల్లును అసెంబ్లీలోనూ ఉప‌సంహ‌రించుకున్న విష‌యం విదిత‌మే.

రాబోవు ఎన్నిక‌ల‌ను మూడు రాజ‌ధానుల మీద న‌డ‌పాల‌ని.(Capital)

రాబోవు ఎన్నిక‌ల‌ను మూడు రాజ‌ధానుల(Capital) మీద న‌డ‌పాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు. దాన్నో ఎన్నిక‌ల అస్త్రంగా మ‌ల‌చ‌డం ద్వారా ఆయ‌న పాల‌న‌లో జ‌రిగిన ఘోరాలు, నేరాలు, అక్ర‌మాలు, దందాల గురించి చ‌ర్చ‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్ల తో చేసిన రివ్యూలో పార్టీ ప‌రిస్థితిని ఆవిష్క‌రించారు. కేవ‌లం 20 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే కాదు, సగానికి పైగా ఓడిపోతార‌ని స‌ర్వేల్లోని సారంశ‌మ‌ని తాడేపల్లి వ‌ర్గాల‌కు తెలుసు. అందుకే, మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా ప్రాంతీయ విభేదాల ద్వారా ఓట్ల‌ను సంపాదించాల‌ని స్కెచ్ వేశార‌ని వినికిడి. ఆయ‌న వేసిన వ్యూహంలో ప్ర‌తిప‌క్షాలు కూడా ప‌డుతూ లేస్తూ ప్ర‌జ‌ల దృష్టిని స్థిరంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసే ఎత్తుగ‌డ‌కు (Jagan Twist)ఎప్ప‌టికప్పుడు ప్ర‌త్య‌ర్థులు తిక‌మ‌క‌ప‌డుతూ రాజ‌కీయ క్రీడ‌ను అడ్డుకోలేక‌పోతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read: Capital AP : విశాఖ‌కు ఆర్బీఐ త‌ర‌లింపు? శ‌ర‌వేగంగా రాజ‌ధాని హంగులు!