జూన్ 9న విశాఖ (Vizag)లో రెండోసారి జగన్ సీఎం(CM Jagan)గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ మంత్రో బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేసారు. ఏపీలో మే 13 న 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ పూర్తియిన సంగతి తెలిసిందే. జూన్ 04 న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరి పైచేయి సాధిస్తారు..? కూటమి విజయం సాధిస్తుందా..? లేక జగన్ మరోసారి సీఎం అవుతారా..? ఎవరికీ మెజార్టీ వస్తుంది..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ ఫలితాలపై మరింత ఆసక్తి పెంచుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పోలింగ్ పూర్తి కాగానే కూటమి నేతలు గెలుపు ధీమా వ్యక్తం చేయగా…వైసీపీ లోని పలువురు మాత్రం కాస్త భయం …భయం గా మాట్లాడారు. దీంతో అందరు కూటమిదే విజయం అని ఫిక్స్ అయ్యారు. కానీ నిన్నటి నుండి వైసీపీ నేతలు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు మరోసారి చర్చ గా మారుతుంది. నిజంగా వైసీపీ గెలుస్తుందా..? అని ఒకెత్త అనుమానం , భయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఈ తరుణంలో ఈరోజు మంత్రి బొత్స మాట్లాడుతూ..జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని, ఎన్టీఆర్ హయాంలో, వైఎస్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ మళ్లీ ఇప్పుడు వస్తున్నాయన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రావాలానే ప్రజలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని, వైనాట్ 175 లక్ష్యానికి దగ్గర్లో సీట్లు గెలవబోతున్నామన్నారు. ఒక బొత్స మాటలతో వైసీపీ శ్రేణుల్లో గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ విషయంపై.. పిఠాపురం వర్మ కామెంట్స్.. తప్పు చేసిన వారికి..