AP Land Survey : భూ హ‌క్కు ప‌త్రాల్లో జ‌గ‌న్ సోకు

`సొమ్మొక‌డిది సోకు మ‌రొక‌డిది` అన్న చందంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం ఉంది.

  • Written By:
  • Updated On - November 23, 2022 / 03:02 PM IST

`సొమ్మొక‌డిది సోకు మ‌రొక‌డిది` అన్న చందంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం ఉంది. సొంత ఆస్తుల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బొమ్మ‌తో ఉండే ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల‌ను ఇష్యూ చేయ‌డం విచిత్రం. రీ స‌ర్వే పేరుతో ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల‌ను మార్చేస్తున్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డాలేని విధంగా పార్టీ రంగులు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బొమ్మ‌తో పుస్త‌కాల‌ను త‌యారు చేయ‌డం విడ్డూరం. గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వ చిహ్నంతో ఉండే ఆస్తి హ‌క్కు ప‌త్రాల‌ను పూర్తిగా మార్చేయ‌డం పౌరు హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌డం కింద‌కు వ‌స్తుంద‌ని విప‌క్ష నేత‌లు నెత్తీనోరూ బాదుకుంటున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ చెవికి ఎక్క‌డంలేదు.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే రెండో విడత కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద భూ సర్వే పూర్తయిన రైతులకు సీఎం భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. రెండు వేల గ్రామాల్లో ఇంటిగ్రేటెడ్ భూ సర్వే ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తయింది. బుధవారం నుంచి గ్రామ సచివాలయాల ద్వారా 2,000 గ్రామాల్లో భూ పత్రాల రీసర్వే మరియు రిజిస్ట్రేషన్ 15 రోజుల పాటు కొనసాగుతుంది.

Also Read:  AP Politics : ఏపీ రాజ‌కీయానికి బీహార్ ఫ్లేవ‌ర్‌

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 21, 2020న YSR జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. రీసర్వే సందర్భంగా, 2వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్ డివిజన్‌ల చేస్తూ 8-9 నెలల వ్యవధిలో భూమి మరియు రెవెన్యూ రికార్డులపై రెండు లక్షల మ్యుటేషన్‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రీసర్వే చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. డ్రోన్లు, నిరంతరాయంగా పనిచేసే రిఫరెన్స్ స్టేషన్లు మరియు GNSS రోవర్లు త‌దిత‌ర‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమగ్ర రీసర్వేను చేపట్టిన మొద‌టి రాష్ట్రంగా ఏపీ ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

మొత్తం 17,461 గ్రామాల్లోని 1.07 కోట్ల మంది రైతులకు చెందిన 2.47 కోట్ల సర్వే నంబర్లలో వ్యవసాయ భూములు కలిపి 2.26 కోట్ల ఎకరాల్లో రీసర్వే ప్రాజెక్టు విస్తరించి ఉంది. 13,371 గ్రామకంఠంలో (గ్రామ నివాసాలు) 85 లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను మరియు 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను సర్వే చేయడానికి ప్రభుత్వం ప్ర‌య‌త్నించింది. గ్రామ స్థలాలు, మున్సిపల్ భూములను కూడా తొలిసారిగా సర్వే చేస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం రూ. 1000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. వ‌చ్చే ఏడాదికి చివ‌రికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది.

Also Read:  AP Politics: అబ్బే మీ పాలన ఏమాత్రం బాగోలేదు.. పవన్ పార్టీలోకి వెళ్తున్న.. ఆ మంత్రి అనుచరుడి ప్రకటన..!

గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో భూముల స‌ర్వే జ‌రిగింది. మునుపెప్పుడూ లేనివిధంగా స‌ర్వే చేసిన భూముల‌కు హ‌క్కుల‌ను క‌ల్పిస్తూ సీఎం బొమ్మ‌లు, పార్టీ రంగుల‌తో హ‌క్కు ప‌త్రాల‌ను ఇవ్వ‌లేదు. కానీ, ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బొమ్మ‌తో పాటు వైసీపీ రంగుల‌తో కూడిన హ‌క్కు ప‌త్రాల‌ను ఇష్యూ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.