Jagan Temper : ఏపీలో పొలిటిక‌ల్ హై టెంప‌ర్

ఉద్రిక్త‌త‌ను క్రియేట్ చేసేలా (Jagan Temper) ఏపీ పాలిటిక్స్ ఉన్నాయి.శాంతి భ‌ద్ర‌త‌ల‌పై న్యాయ‌మూర్తులు సుప్రీంకు చేర‌వేసిన సంద‌ర్భం ఉంది.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 01:36 PM IST

ఎన్నిక‌ల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌ను క్రియేట్ చేసేలా (Jagan Temper) ఏపీ పాలిటిక్స్ ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై హైకోర్టు న్యాయ‌మూర్తులు సుప్రీం కోర్టుకు చేర‌వేసిన సంద‌ర్భం ఉంది. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లో రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించిన జ‌డ్జి రాకేశ్ రూల్ ఆఫ్ లా ఏపీలో లేద‌ని ఆందోళ‌న చెందారు. ఆ విష‌యాన్ని సుప్రీం కోర్టుకు తెలియ‌చేసిన విషయం విదిత‌మే. ఆయ‌న చెప్పిన ప‌రిస్థితుల కంటే ప్ర‌స్తుతం ఇంకా భ‌యంక‌రంగా ఉన్నాయ‌ని చెప్ప‌డానికి చిత్తూరు జిల్లా అంగ‌ళ్ల వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌నను తాజా ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవచ్చు.

ఉద్రిక్త‌త‌ను క్రియేట్ చేసేలా  ఏపీ పాలిటిక్స్(Jagan Temper)

అర్థ‌రాత్రి వేళ సామాన్యుల ఇళ్ల మీదకు ఏపీ పోలీసులు వ‌స్తోన్న సంఘ‌ట‌న‌లు అనేకం. వ‌చ్చిన వాళ్లు పోలీసులా? కాదా? అనే నిర్థార‌ణ కూడా ఉండ‌డంలేదు. సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్లను, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద వ్య‌తిరేకంగా న్యూస్ రాసిన వాళ్ల‌ను, చూపించిన జ‌ర్న‌లిస్ట్ ల‌ను కూడా వ‌ద‌ల‌డంలేదు. ఎప్పుడు ఎవ‌రు ఎటు వైపు నుంచి వ‌చ్చి తీసుకెళ‌తారో అనే భ‌యాందోళ‌న నెల‌కొంది. ప్ర‌త్యేకించి టీడీపీ క్యాడ‌ర్ మీద నిఘా ఎక్కువ‌గా ఉంది. యాక్టివ్ గా ఉండే కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెడుతున్నారు. ఇటీవ‌ల ప‌ల్నాడులోని విన‌కొండ వ‌ద్ద జ‌రిగిన రాళ్ల దాడిని చూశాం. ఆ త‌రువాత చిత్తూరు జిల్లా అంగ‌ళ్లు వ‌ద్ద వైసీపీ, టీడీపీ క్యాడ‌ర్ మ‌ధ్య రాళ్ల దాడి రాష్ట్రంలోని శాంతిభ‌ద్ర‌త‌ల‌ను  (Jagan Temper)  ప్ర‌శ్నించేలా ఉంది.

చంద్ర‌బాబు మీద కేసు న‌మోదు

కుట్ర‌పూరితంగా అంగ‌ళ్ల వ‌ద్ద చంద్ర‌బాబు క్యాడ‌ర్ ను ఉసికొల్పి ఘ‌ర్ష‌ణ‌కు తెగ‌బ‌డ్డార‌ని పోలీస్ కేసు న‌మోదు చేసింది. ఆయ‌న మీద హ‌త్యాయ‌త్నం కేసు పెడుతూ ఎఫ్ ఐ ఆర్ ను సిద్ధం చేశారు. చెన్నై, విజ‌య‌వాడ ప్రాంతాల నుంచి గూండాలను, రౌడీల‌ను త‌ర‌లించ‌డం ద్వారా గొడ‌వ‌లు పెట్టార‌ని చంద్ర‌బాబు మీద కేసు న‌మోదు అయింది. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అనుచ‌రుల ప్ర‌మేయం ఈ ఘ‌ర్ష‌ణ వెనుక ఉంద‌ని తేల్చిన ఏపీ పోలీస్ ఆయ‌నను ఏ2కింద చేర్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 74 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి, టీడీపీ లీడ‌ర్ న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల మీద కేసులు న‌మోదు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి సంబంధించిన వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని  (Jagan Temper) టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా

ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్లులో జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై ముదివేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాలను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120 బీ, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 ఆర్/డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయ‌డం ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. అధికార‌ప‌క్షంకు చెందిన వాళ్ల మీద కేసులు పెట్ట‌క‌పోవ‌డాన్ని (Jagan Temper) టీడీపీ నిర‌సిస్తోంది.

చంద్ర‌బాబు  తాజాగా ప్రాజెక్టుల బాట (Jagan Temper)

ఇటీవ‌ల చంద్ర‌బాబు ఎక్క‌డ మీటింగ్ లు పెట్టిన‌ప్ప‌టికీ జ‌నం కిక్కిరిసిపోతున్నారు. మ‌హానాడు ఒంగోలు కేంద్రంగా జ‌రిగిన‌ప్ప‌టి నుంచి టీడీపీ దూకుడు పెరిగింది. కంటిన్యూగా మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను నిర్వ‌హిస్తూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఆ త‌రువాత ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అంటూ ప్ర‌తి జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు కార్య‌క్రమాల‌ను రూపొందించుకున్నారు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన రోడ్ షోల‌కు జ‌నం ఎగ‌బ‌డ్డారు. గుంటూరు, నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన స‌భ‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగి 12 మంది మృతి చెందారు. ఆ రోజు నుంచి ఆయ‌న రోడ్ షోలు, స‌భ‌ల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్  (Jagan Temper) ఆంక్ష‌లు పెట్టింది. జీవో నెంబ‌ర్ 1ను విడుద‌ల చేసింది.

Also Read : Jagan Punganuru : 30ఏళ్ల పాటు సీఎం క‌ల ఫ‌లితం `పుంగ‌నూరు` ఎపిసోడ్ ?

బ్రిటీష్ కాలం నాటి జీవో నెంబ‌ర్ 1 మీద న్యాయ‌పోరాటం టీడీపీ చేసింది. ఆ త‌రువాత ప్ర‌జాక్షేత్రంలోకి చంద్ర‌బాబు చురుగ్గా దూకారు. తాజాగా ప్రాజెక్టుల బాట పట్టారు. ఆధునిక దేవాయాలైన ప్రాజెక్టుల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యాన్ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు, క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. ప‌ది రోజుల పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా స‌ర్కార్ నిర్ల‌క్ష్యాన్ని క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు చూపించాల‌ని తొలుత రాయ‌ల‌సీమ‌లోకి చంద్ర‌బాబు అడుగుపెట్టారు. ఆ రోజు నుంచి టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని వైసీపీ క్రియేట్ చేసింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసింది. క‌డ‌ప జిల్లా పులివెందులలో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టి నుంచి వైసీపీ ర‌గిలిపోతోంది. దాని ప‌ర్య‌వ‌సానంగా తంబ‌ళ్ల‌ప‌ల్లి స‌మీపంలోని అంగ‌ళ్లు, పుంగ‌నూరు వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌కు వైసీపీ క్యాడ‌ర్ దిగింది. ప్ర‌తి టీడీపీ క్యాడ‌ర్ ఘ‌ర్ష‌ణ‌కు సంసిద్ధ‌మ‌యింది.

Also Read : Tollywood vs CM Jagan: చిరు వ్యాఖ్యల్ని సమర్ధించిన వైసీపీ రెబల్ ఎంపీ

ప్ర‌స్తుతం ఉత్తరాంధ్ర‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయ‌న ప్రాజెక్టుల ప‌రిశీల‌న చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌డుతున్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌నపై ఏపీ పోలీసులు హ‌త్య‌యత్నం కేసును న‌మోదు చేశారు. దీంతో ఏపీ రాజ‌కీయం హై టెంప‌ర్ స్థాయికి వెళ్లింది. ప్ర‌తిగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు దిగేలా ప్లాన్ చేస్తోంది. ఇలా, ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయాన్ని వేడిక్కించ‌డం ద్వారా అభివృద్ధి మీద చర్చ జ‌ర‌గ‌కుండా భావోద్వేగాలు, సామాజిక, ప్రాంతీయ అంశాల మ‌ధ్య మ‌రో ఛాన్స్ కొట్టేసేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పావులు క‌దుపుతున్నార‌ని విప‌క్షాల అనుమానం. అందుకే, ఇలా రెచ్చ‌గొట్టేలా అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఏపీ మేధావుల అభిప్రాయం.