Jagan Stickers : ప‌బ్లిసిటీ ప‌రాకాష్ట‌,జ‌గ‌న్ స్టిక్క‌ర్ల‌తో నిర్బంధం

`ట్యాగ్ లైన్` తో అధికారంలోకి రావాల‌ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌యత్నించ‌డం 2009 ఎన్నిక‌ల నుంచి చూస్తున్నాం.

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 12:54 PM IST

`ట్యాగ్ లైన్` తో అధికారంలోకి రావాల‌ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌యత్నించ‌డం 2009 ఎన్నిక‌ల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో అడుగు ముందుకేసి `ట్యాగ్ లైన్ ` ప్ర‌చారానికి స్టిక్క‌ర్(Jagan Stickers) వేశారు. దాన్ని ఇంటింటికీ అంటించే వ‌ర‌కు తీసుకెళ్లారు. అంటే, ప‌బ్లిసిటీ ప‌రాకాష్ట‌కు(Publicity peaks) చేరింద‌న్న‌మాట‌. స‌ర్వే సంస్థ‌లు, వ్యూహ‌క‌ర్త‌లు, సినిమాటిక్ ప్ర‌చారం ఉంటే చాలు అధికారంలోకి రావ‌చ్చ‌న్న భావ‌న రాజ‌కీయ పార్టీలకు బాగా అబ్బింది.

గుడ్ ఫ్రైడే నుంచి సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డానికి.(Jagan stickers)

ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుడ్ ఫ్రైడే నుంచి సొంత డ‌బ్బా (Jagan stickers)కొట్టుకోవ‌డానికి ప్రజాధ‌నం దుర్వినియోగానికి తెర‌లేపారు. గృహ సార‌థులు, వ‌లంటీర్లు ప్ర‌తి ఇంటికి వెళ్లి `మా న‌మ్మ‌కం నువ్వే జ‌న‌న్`  అంటూ త‌యారు చేసిన స్టిక్క‌ర్ల‌ను అంటించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం(Publicity peaks) చుట్టారు. మ‌రో స్టిక్క‌ర్ `జ‌గ‌నన్నే మా భ‌విష్య‌త్` అనే మ‌రో ట్యాగ్ లైన్ తో మ‌రో స్టిక్క‌ర్ ను కూడా త‌యారు చేశారు. అంటే, రాబోవు రోజుల్లో ప్ర‌తి ఇంట్లో ఈ రెండు స్టిక్క‌ర్లు ఉండాల్సిందే. ఇష్టం ఉన్నా, లేకున్నా ఆ స్టిక్క‌ర్ల‌ను ఇళ్ల‌కు పెట్టుకోవాలి. లేదంటే , జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు క‌ట్ అవుతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

Also Read : Jagan : స‌ర్కార్ కు ఆర్థిక సంక‌టం,ఉద్యోగుల చెల‌గాటం

గుడ్ ఫ్రైడే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇష్ట‌మైన రోజు. అందుకే, ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు `జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్‌` ప్ర‌చారానికి (Publicity peaks) శ్రీకారం చుట్టారు. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గడపకు వెళ్లి స్టిక్క‌ర్ల‌ను అంటిస్తారు. సుమారు 1 కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా క‌లుసుకుని స్టిక్క‌ర్లు వేయ‌డం ఈ ప్రోగ్రామ్ ల‌క్ష్యం. ఏడు లక్షల మంది గృహసారథులు ఇందులో పాల్గొంటున్నారు. జ‌గ‌న‌న్న పంపించాడ‌ని వెళ్లే గృహ‌సార‌థులు, సచివాల‌య కో ఆర్డినేట‌ర్లు జ‌గ‌న‌న్న సందేశాన్ని వినిపిస్తారు. ఆ త‌రువాత ఇళ్ల‌కు స్టిక్క‌ర్లు (Jagan stickers) వేస్తారు.

గృహ సారథులు అందించే ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్

గత టీడీపీ పాలన, ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంద‌ని తెలియ‌చేసే క‌ర‌ప‌త్రంతో ఇళ్ల వెళ‌తారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అనేది వివ‌రిస్తారు. ఆ త‌రువాత సర్వే బుక్ లెట్ లో ఉండే 5 ప్రశ్నలకు స‌మాధానం తీసుకుని గృహ‌సార‌థులు, క‌న్వీన‌ర్లు వచ్చేలా ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. చివ‌రిగా జగనే మా నాయకుడు, ఆయనకే మా ఆశీస్సులు అని భావించినవారు గృహ సారథులు అందించే ఓ ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వ‌మ‌ని చెబుతారు. వెంట‌నే జగన్ సందేశం ఐవీఆర్ఎస్ పద్ధతిలో వినిపిస్తుంది. ఆ త‌రువాత అభ్యంతరం లేకపోతే సీఎం జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ (Jagan stickers)ను మీ ఇంటి తలుపుకు అంటిస్తామని గృహ సారథులు ఆయా కుటుంబాలను కోరతారు. దాంతో పాటే ఫోన్ కు అంటిస్తారు.

Also Read : Jagan Strategy: గెలుపు గుర్రాలకే జగన్ ఛాన్స్.. సీఎం వ్యాఖ్యల మర్మమిదే!

ఇలాంటి ప్ర‌చారం ఎప్పుడూ, ఏ రాజ‌కీయ పార్టీ ఎక్క‌డా చేయ‌లేదు. గ‌తంలో `మీ భ‌విష్య‌త్ నా భ‌రోసా` అంటూ ప‌త్రిక‌ల్లో, టీవీల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకున్నారు. క‌ర‌ప‌త్రాల‌ను పంచారు. అంతేగానీ, ఇళ్ల‌కు స్టిక్క‌ర్లు వేసే ప‌ద్ధ‌తికి పోలేదు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి `ట్యాగ్ లైన్ ` ప్ర‌చారం మొద‌లైయింది. ఆనాడు ప్ర‌జారాజ్యం పార్టీకి ట్యాగ్ లైన్ గా `ప్రేమే ల‌క్ష్యం-సేవే మార్గం` అంటూ సినిమాటిక్ ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత కొత్త పుంత‌లు తొక్కుతూ పార్టీల ట్యాగ్ లైన్లు ఇళ్ల త‌లుపులు , వాకిళ్ల వ‌ర‌కు వ‌చ్చేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Publicity peak) తీసుకొచ్చారు.

Also Read : KVP-Jagan : తాడేపల్లిని తాకిన‌ వైఎస్ ఆత్మ‌! త్వ‌ర‌లో విడుద‌ల