వైసీపీ అధినేత, సీఎం జగన్ (jagan) నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి (Bheemili ) సంగివలస (Sangivalasa )లో ‘సిద్ధం’ పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ , జనసేన, కాంగ్రెస్ , బిజెపి ఇలా అన్ని పార్టీల ఫై జగన్ విమర్శలు చేసారు. ముఖ్యంగా టీడీపీ ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు.
ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని .. ‘కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం భీమిలిలో కనిపిస్తోంది. కృష్ణుడిలా నాకు కార్యకర్తలు, ప్రజలు అండగా ఉన్నారు. చంద్రబాబుతో సహా కౌరవ సైన్యం అంతా ఓడిపోతుంది. పథకాలు, అభివృద్ధే మన అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు కొట్టడమే మన టార్గెట్’ అని జగన్ చెప్పుకోచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని సీఎం పేర్కొన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడని సీఎం పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also : Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!