Jagan comments : వైసీపీ అధినేత జగన్ పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.
Read Also: Greenfield Highway : అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం అనుమతి
జగన్ వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. జగన్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగులుగా మహిళలు ఉన్నారని జగన్ మరిచారా? అని పోలీసు అధికారుల సంఘం సభ్యురాలు ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ తన వ్యాఖ్యలు వెనక్కితీసుకుని పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పోలీస్ అధికారుల సంఘం అన్నారు.
కాగా, పాపిరెడ్డిపల్లిలో వైఎస్ జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు కోసం పని చేస్తున్న ప్రతి పోలీసుకూ చెబుతున్నా ఎల్లకాలం ఆయన పాలన సాగదు. చంద్రబాబు పాలన లేని రోజు త్వరలోనే వస్తుంది. మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. ప్రతి పోలీసు అధికారి మార్పు తెచ్చుకోండి. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీ సహా లెక్కేసి, దోషులుగా నిలబెట్టి మరీ కక్కిస్తాం. ప్రతి పోలీసు అధికారికీ చెబుతున్నా, మీ బట్టలూడదీస్తాం. యూనిఫాం తీసి, షర్టు లేకుండా నిలబెడతాం అని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Russia : విక్టరీ డే పరేడ్.. భారత ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం