Site icon HashtagU Telugu

AP CM YS Jagan : అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునే ప్యాకేజీ స్టార్‌ – జగన్

Jagan Speech

Jagan Speech

ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , చంద్రబాబు (Chandrababu) ఫై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంద‌ని ఎద్దేవా చేశారు.

గురువారం సామ‌ర్ల‌కోట‌ (Samarlakota )లో సామూహిక గృహ ప్ర‌వేశ మ‌హోత్స‌వంలో ముఖ్య‌మంత్రి జగన్ పాల్గోని.. నిరుపేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేసాడు. సామ‌ర్ల‌కోట‌లో పూర్త‌యిన వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీ (YSR Jagananna Colony)ల్లోని నూత‌న గృహాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. అనంతరం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ (Samarlakota Public Meeting)లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

ఈ సందర్భాంగా ఆయన (Jagan Samarlakota Public Meeting Speech ) మాట్లాడుతూ..చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్ ), బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంద‌ని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే అని జగన్ ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్‌. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్ అని విమ‌ర్శించారు. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు అంటూ విమర్శించారు.

చంద్రబాబు పాలనలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వేలేదు. వేల కోట్ల సంపద ఉన్నా కుప్పంలోనూ పేదలకు సెంటు స్థలం ఇవ్వేలేదు. కానీ మా ప్రభుత్వం కుప్పంలో 20 వేల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కి రాష్ట్రంపై ఏమాత్రం బాధ్యత లేదు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు రాష్ట్రంలో ఒక్క ఇళ్లు కూడా కట్టుకోలేదు. పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ లో చంద్రబాబు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎలా జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చంద్రబాబు, పవన్ పై నిప్పులు చెరిగారు.

Read Also : Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ రిజర్వ్