ఎన్నికల నాటికి (Jagan Rule) కడప తరహా రాజకీయ టెంపర్ ఏపీ వ్యాప్తంగా క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా వాతావరణం నెలకొంటోంది. అందుకు తాజా ఉదాహరణ వినుకొండలో జరిగిన పోలీస్ కాల్పులు. గుంటూరు జిల్లా పల్నాడు పరిధిలోని వినుకొండ నియోజకవర్గంలోని పరిస్థితిని గమనిస్తే, రాబోవు రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అనేదానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఎన్నికల నాటికి కడప తరహా రాజకీయ టెంపర్ ఏపీ వ్యాప్తంగా(Jagan Rule)
ఏపీ వ్యాప్తంగా వైసీపీ లీడర్లు మట్టి, ఇసుక క్వారీ, రియలెస్టేట్ తదితర వ్యాపారులు చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన దందాలను టీడీపీ ఏడాది క్రితం బయటపెట్టింది. ఆ తరువాత మంత్రివర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేసుకున్నారు. కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది తీరు మారలేదు. మట్టి, ఇసుక క్వారీల మీద పట్టు సాధించారు. పేదలకు ఇళ్ల పట్టాలంటూ ఏడాది క్రితం జరిగిన దందాను టీడీపీ బయటపెట్టింది. కనీసం 20వేల కోట్ల కుంభకోణం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట జరిగిందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయినప్పటికీ ఎక్కడా (Jagan Rule)విచారణ జరగలేదు.
వినుకొండలో పోలీసులు గాల్లోకి కాల్పులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందాలను ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. అడొచ్చిన వాళ్లను వాహనాలతో తొక్కుకుంటూ వెళుతోన్న దృశ్యాలు బోలెడు. వాటికి ఏ మాత్రం వెరవకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారు. ఆ కోవలోకి వచ్చే సంఘటన వినుకొండలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చేస్తోన్న మట్టి, ఇసుక దందాను నిరసిస్తూ టీడీపీ ర్యాలీ చేసింది. అడ్డుకుంటూ టీడీపీ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో క్యాడర్ ర్యాలీకి దిగారు. ప్రతిగా వైసీపీ క్యాడర్ కూడా పోటీగా ర్యాలీకి పూనుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీంతో ఇరు వర్గాల రాళ్ల దాడి (Jagan Rule) జరిగింది. ఈ దాడిలో 15 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వినుకొండలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు.
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు
గతంలోనూ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ దాడి చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన `బూసడికే` కామెంట్ ను నిరసిస్తూ జోగి రమేష్ అండ్ కో దాడులకు పాల్పడారు. సీన్ కట్ చేస్తే ఆయనకు మంత్రి పదవి లభించింది. పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు. (Jagan Rule)దాడులకు తెగబడ్డారు. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందని సంకేతాలు ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇలాంటి పరిస్థితి రాబోవు రోజుల్లో మరిన్ని చోట్ల ఉండేలా వైసీపీ చేస్తోందని టీడీపీ భావిస్తోంది. వై నాట్ 175 అంటూ మైండ్ గేమ్ ఆడుతోన్న వైసీపీ అధిష్టానం కడప తరహా టెంపర్ ఎన్నికల నాటికి క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల వారాహి యాత్ర చేసిన పవన్ కూడా వెలుబుచ్చారు.
Also Read : Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2వ విడతలో రూ.45.53 కోట్లు విడుదల
ప్రజాస్వామ్యబద్ధంగా కడప జిల్లాలో ఎన్నికలు జరగవని చాలా కాలంగా ఉన్న అభిప్రాయం. అక్కడ ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రిగ్గింగ్ తరహా ప్రక్రియను ఆపలేకపోతున్నారు. ఇటీవల పరిస్థితులు కొంత మారినప్పటికీ పూర్వం బూత్ లకు వెళ్లి ప్రజలు ఓట్లు వేయాలంటే భయపడే వాళ్లు. అందుకే, వైఎస్ కుటుంబం సుదీర్ఘ కాలం రాజకీయాలను అక్కడ నడుపుతుందని సర్వత్రా తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు మారినప్పటికీ వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయాలను నడిపేందుకు కొద్దిమంది మాత్రమే బయటకు వస్తారు. ఆ జాబితాలో బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణ క్రియేట్ చేయాలని వైసీపీ వ్యూహాలను (Jagan Rule)రచిస్తుందని టీడీపీ భావన. అందుకే, తాజాగా వినకొండ సంఘటన చోటుచేసుకుందని చెబుతోంది.
Also Read : Jagan 2.0:AP ఓటరూ బహుపరాక్ !`0`తో జిగేల్ రాజా!