Jagan : రేపు పులివెందులకు వైస్ జగన్

ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికే పరిమితమైన ఆయన ఫలితాల తర్వాత మొదటిసారి బయటకు రానున్నారు

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 03:02 PM IST

మాజీ సీఎం జగన్ (Jagan) రేపు పులివెందుల (Pulivendula )లో పర్యటించబోతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికే పరిమితమైన ఆయన ఫలితాల తర్వాత మొదటిసారి బయటకు రానున్నారు. జూన్ 21 వరకు పులివెందులలోనే ఉండి, ఆ రోజు సాయంత్రానికి తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు. అనంతరం ఈ నెల 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. వాస్తవానికి రేపు ఉదయం జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే జగన్‌ పులివెందుల పర్యటన నేపథ్యంలోనే 22వ తేదీకి ఆ సమావేశాన్ని వాయిదా వేసింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈవీఎం లపై జగన్ చేసిన ట్వీట్ ఆయన్ను వివాదంలో నెట్టేస్తుంది. ప్రస్తుతం ఈవీఎం(EVM)లఫై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ జగన్ (Jagan) అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చ కు దారితీసింది. రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు గెలిచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమికి కారణం ఈవీఎం లే అనే అనుమానాన్ని తాజాగా జగన్ వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక (X) లో పోస్ట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

“న్యాయం అందడమే కాదు.. అందజేసినట్లు కూడా కనిపించాలి, ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి.. పేపర్ బ్యాలెట్​ ఓటు పారదర్శకతను పెంచుతుందని, ప్రజల్లో విశ్వాసం నింపుతుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్​ పేపర్​ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్‌ వాడకం ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటుతుంది, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని పేర్కొన్నారు. జగన్ చేసిన ఈ ట్వీట్ ఫై అధికార పార్టీ నేతలతో పాటు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే జగన్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని బయటకు తీశారు. “80 శాతం ఓటర్లు పోలింగ్ బూత్​లో బటన్ నొక్కారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్​లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్​ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సాటిస్​ఫై అయ్యారు. 80శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ కంప్లయింట్​ ఇవ్వలేదు. నేను ఫ్యాన్​ గుర్తుకు ఓటేసి వీవీ ప్యాట్​లో సైకిల్​ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మనుంటా? గమ్మనుండను కదా! అక్కడే బూత్​లోనే గొడవ చేసి ఉండేవాడిని. కంప్లయింట్​ ఇచ్చే వాడిని. ఏ పార్టీ వాడైనా ఓటేసిన తర్వాత వేరే పార్టీకి పడుతున్నట్లుగా ఎవరికీ కనిపించలేదు కాబట్టే 80శాతం మంది జనాభా ప్రతి ఒక్కరూ సాటిస్​ఫై అయ్యారు. ఎటువంటివి ఎక్కడా జరగలేదు.” అని ఆరోజు స్వయంగా జగన్ చెప్పుకొచ్చారు.

మరి అప్పుడు ఆలా..ఇప్పుడు ఇలా ఏంటి జగనన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం అని బుద్ధా పేర్కొన్నారు.

Read Also : MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్