Site icon HashtagU Telugu

Jagan Odarpu Yatra 2.0 : జనవరి నుంచి జగన్‌ ఓదార్పు యాత్ర..?

Jagan Odarpu

Jagan Odarpu

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి ఓదార్పు యాత్ర (Jagan Odarpu Yatra)కు సిద్ధం అంటున్నాడు. 2019 ఎన్నికల ముందు ఓదార్పు యాత్ర చేసి జనాలను ఆకట్టుకున్న జగన్..ఈసారి ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో మరోసారి యాత్ర చేయాలనీ భావిస్తున్నాడు. వై నాట్ 175 అంటూ పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్లిన జగన్ కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 175 ముందు 17 కూడా ఇవ్వలేదు. కేవలం 11 స్థానాలతో అసెంబ్లీ మూలాన కూర్చోపెట్టారు. ఇంత భారీ షాక్ ఇవ్వడం తో ఇక క్యాంపు కార్యాలయం లో ఉంటె..వచ్చేసారి తనను కూడా గెలిపించలేరని భావించిన జగన్..మళ్లీ ఓదార్పు అంటున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేర‌కు ఆయ‌న త‌న మ‌నసులో మాట‌ను పార్టీ నేతలకు తెలియజేసారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం లో నిర్వ‌హించిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు, గెలిచిన నాయ‌కుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కుల్లో ఆయ‌న ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వ‌చ్చింద‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వ మంచి కార్య‌క్ర‌మాల‌పైనా బురద జల్లారంటూ కూటమి పార్టీల ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్… ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌కంగా వంచిచారని వ్యాఖ్యానించారు. తాను త్వ‌ర‌లోనే ఓదార్పు యాత్ర చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై అనేక దాడులు జ‌రిగాయ‌ని, అనేక మందిని చంపేశార‌ని.. వారి వారి కుటుంబాల‌ను తాను క‌లిసి సాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. జగన్ ప్రకటన కు నేతలు సైతం సిద్ధం అన్నారు. డిసెంబర్‌ లేదా జనవరి నుంచి జగన్‌ ఓదార్పు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు హాజరకాలేకపోయారు. బెంగళూరు-విజయవాడ విమానం రద్దుతో హాజరుకాలేకపోతున్నట్లు పలువురు నేతలు పార్టీ ఆఫీస్‌కు సమాచారం ఇచ్చారు. ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వెంకటేగౌడ్, చెవిరెడ్డి భాస్కరెడ్డి, మోహిత్‌రెడ్డి, బుర్రా మధుసూదన్, విక్రమ్, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపిక, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన రెడ్డప్ప వంటి నేతలు మీటింగ్‌కు హాజరకాలేకపోయారు. నిజంగా విమానం రద్దు వల్లే హాజరుకాలేదా..? లేక హాజరు కావొద్దని కాలేదా అనేది వారికే తెలియాలి.

Read Also : Telangana Rythu Bandhu Funds : కేవలం వారికీ మాత్రమే రైతు బంధు..?