వైఎస్ జగన్ లో ఇటీవల జరిగిన మార్పులు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి భారంగా మారుతున్నాయని కార్యకర్తలు, నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం తక్కువగా ఇచ్చారు. ఎక్కువగా సీఎం కార్యాలయం నుంచే పరిపాలన సాగడం వల్ల ఫీల్డ్ నుంచి వచ్చే నిజమైన సమస్యలు ఆయన దృష్టికి చేరలేదు.
Tragedy : నెల్లూరులో మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారా?
2014 నుంచి పార్టీ కోసం శ్రమించిన, ఆర్థికంగా నష్టపోయిన నేతలను పట్టించుకోకపోవడం వల్ల, వారి నిబద్ధతకు జగన్ తగిన గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డవారి పట్ల కనీస పరామర్శ లేకపోవడం, పలకరింపుల లేకపోవడం వారిలో ఆవేదనగా మారిందని చెబుతున్నారు. ఐప్యాక్ టీమ్ పై ఆధారపడటం, నిజమైన ఫీడ్‌బ్యాక్ తెలుసుకోకపోవడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా దెబ్బతింది.
ఇక నుండి అయినా జగన్ పార్టీ శ్రేణులను దగ్గర చేసుకుని, వారి అభిప్రాయాలను స్వీకరించే వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ కారణాలతో నేతలు, కార్యకర్తలను దూరం పెడితే మళ్లీ ప్రజల్లో అదే అసంతృప్తి కలుగుతుంది. ఒక నాయకుడిగా తన కేడర్‌ను ప్రోత్సహించేందుకు, వారిలో నమ్మకం పెంచేందుకు జగన్ చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలతో బంధం పెంచుకుంటేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే పార్టీ మరోసారి ప్రతిపక్షంలో కూడా లేకుండా పోతుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్ అది తెలుసుకొని మారతాడా అనేది చూడాలి.