Jagan MLC : అమ్మో `తాడేప‌ల్లి`..ఇప్పుడెళ్లారో.!

సినిమా రంగాన్ని `బుల్లెట్ దిగిందా? లేదా?`అనే డైలాగ్ ఊపేసింది.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 12:59 PM IST

తెలుగు సినిమా రంగాన్ని `బుల్లెట్ దిగిందా? లేదా?` అనే డైలాగ్ ఊపేసింది. ఇప్పుడు ఆ డైలాగును వైసీపీకి(Jagan MLC) వ‌ర్తింప చేస్తే టీడీపీ(Chandrabau) పైచేయి సాధించిందా? లేదా? అనేది ముఖ్యం. ఏడుగురిలో ఆరుగురు ఎమ్మెల్సీలు గెలిచామ‌ని చెప్పుకుంటూ వైసీపీ మ‌భ్య పెట్టుకుంటోంది. అంతేకాదు, క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ల‌ను స‌స్సెండ్ చేసే ద‌మ్ము కూడా ఆ పార్టీకి లేదని తెలుస్తోంది. ఎందుకంటే, ఉప ఎన్నిక‌లు వ‌స్తే అభాసుపాల‌వుతామ‌ని భ‌య‌ప‌డుతోంది. అందుకే, మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను కోల్పోయినా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలోని ఏడో ఎమ్మెల్సీ ప‌ద‌విని పోగొట్టుకున్నా స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ల‌ను స‌స్సెండ్ చేసే ద‌మ్ము (Jagan MLC)

వైనాట్ 175 అంటూ రంకెలు వేసిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan MLC) ఏపీ ప‌ట్ట‌భ‌ద్రులు క‌ర్రుకాల్చి వాత‌పెట్టారు. ఆ పుండు మాన‌కుండా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్ దించారు. చంద్రబాబు(Chandrababu) ట్రిగ‌ర్ నొక్కితే ఎలా బుల్లెట్ దూసుకొస్తుందో మొద‌టిసారి ప్ర‌త్య‌క్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రుచిచూశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని విర్ర‌వీగారు. అసెంబ్లీ లోప‌ల‌. బ‌య‌ట ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల మీద చేయిచేసుకుని అసెంబ్లీ ప‌రువు పోగొట్టారు. అందుకు ప్ర‌తిగా ప్ర‌జ‌లు, ఎమ్మెల్యేలు వ‌రుస‌గా ఇచ్చిన వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఛీద‌రించుకున్నారు. ఫ‌లితంగా మూడు ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టీడీపీ ఖాతాలోకి వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

సీఐడీ అధికారి సునీల్ ను లూప్ లైన్లోకి

`పరిపాల‌న మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jagan MLC)ప‌ట్టులేదు. సివిల్ స‌ర్వెంట్ల మాట విన‌రు. స‌ల‌హాదారుల మాట ప‌ట్టించుకోరు. ఆయ‌న చెప్పిందే వినాలి.` ఇదీ స‌ల‌హాదారుల పోస్టుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు చెప్పే మాట‌. అలాగే, వైసీపీలో ఉండే కొంద‌రు ఎమ్మెల్యేలు వినిపించే అభిప్రాయం. తిరుగులేని మోజార్టీని ఇచ్చిన ఏపీ ప్ర‌జ‌ల మీద భారం మోపుతూ మ‌ద్య నిషేధం, సీపీఎస్ లాంటి ప్రాచుర్యం పొందిన హామీల‌ను అట‌కెక్కించారు. ఉద్యోగ‌, నిరుద్యోగుల నుంచి వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకున్నారు. మొండి వైఖ‌రితో ప్ర‌తిప‌క్షాన్ని, ప్ర‌జ‌ల‌ను పానిక్ సిట్యువేష‌న్ లో బ‌తికేలా చేశారు. అందుకోసం సీఐడీని విచ్చ‌లవిడిగా వాడుకున్నారు. ఆ విభాగం పనితీరును నవ్వుల‌పాలు చేశారు. చివ‌ర‌కు సీఐడీ అధికారి సునీల్ ను లూప్ లైన్లోకి పంపారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఐఏఎస్ లు జైలు (Jagan MLC)

వ్యవ‌స్థ‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan MLC) తొలి నుంచి సొంత క‌క్ష్య తీర్చుకోవ‌డానికి వాడుకుంటున్నార‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. రూల్ ఆఫ్ లా రాష్ట్రంలో లేద‌ని హైకోర్టు జ‌డ్జి రాకేష్ రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ మేర‌కు సుప్రీం కోర్టుకు లేఖ కూడా రాశారు. ఇక ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, డీజీపీల‌తో స‌హా ప‌లువురు ఐఏఎస్, ఐపీఎస్ ల‌ను కోర్టు ఎదుట చేతులు క‌ట్టుకునేలా చేశారు. కొన్ని సంద‌ర్భాల్లో కోర్టుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన ఐఏఎస్ లు ఇప్పుడున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హయాంలో అనేకులు. ఆనాడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఐఏఎస్ లు జైలు పాల‌య్యారు. ఇప్పుడు కోర్టుల ముందు నిల్చుంటూ అవ‌మానాల‌ను ఎదుర్కొంటున్నారు. దీనంత‌టికీ కార‌ణం అవగాహ‌న లేని సీఎం ఉండ‌డ‌మే అంటూ ప‌లు సంద‌ర్భాల్లో స‌చివాల‌య వ‌ర్గాలు బాహాటంగా విమ‌ర్శించే ప‌రిస్థితి వ‌చ్చింది.

వ‌లంట‌రీ వ్య‌వ‌స్థ ద్వారా ఎమ్మెల్యేలు, ప్ర‌జ‌ల మ‌ధ్య అగాధం

స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌ను వ్య‌తిరేకం చేసుకుంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan MLC) పరిపాల‌న సాగిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. వైసీపీలోని ప‌లువురు ఎమ్మెల్మేలు అమ‌రావ‌తి విష‌యంతో పాటు ఒక త‌ట్ట‌మ‌ట్టి వేయించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని ఆవేద‌న చెందుతున్నారు. వ‌లంట‌రీ వ్య‌వ‌స్థ ద్వారా ఎమ్మెల్యేలు, ప్ర‌జ‌ల మ‌ధ్య అగాధం ఏర్ప‌డింది. దీంతో ఎమ్మెల్మేలు ఉత్స‌వ విగ్ర‌హాలు మాదిరిగా ఉండిపోయారు. నేరుగా సీఎం, జ‌నం అన్న‌ట్టు న‌డిపారు. ఆ ప‌ద్ద‌తే ఇప్పుడు వైసీపీని ప్ర‌జాక్షేత్రంలో దోషిగా నిలుపుతుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప‌లువురు వాపోతున్నారు. ఇప్పుడు వాళ్ల‌లోని అసంతృప్తిని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రూపంలో వెళ్ల‌గ‌క్కారు.

Also Read : TDP MLC : గెలుపు`వ‌సంతం`,చంద్ర‌బాబు చాణ‌క్యంలో..!

ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది అప్ టూ మార్క్ లేర‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan MLC) అభిప్రాయం. ఆ విష‌యాన్ని రివ్యూ స‌మావేశాల్లో ప‌లుమార్లు వ్య‌క్త‌ప‌రిచారు. కొంద‌రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కూడా క‌ష్ట‌మ‌ని సంకేతాలు ఇచ్చేశారు. త‌నంటే 80 శాతం మంది ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డుతున్నార‌ని, స్థానిక ఎమ్మెల్యేలు అంటే చాలా నియోక‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని రివ్యూల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పే మాట‌. ఎవ‌రి గ్రాఫ్ అయితే, ప‌డిపోయిందో వాళ్ల‌కు టిక్కెట్లు లేవ‌ని సున్నితంగా చెబుతూ వ‌స్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జ‌ల‌క్

క‌నీసం 40 మందికి టిక్కెట్లు ఉండ‌వ‌ని ప‌రోక్ష సంకేతాలు కూడా తాడేప‌ల్లి వ‌ర్గాలు ఇచ్చేశాయ‌ట‌. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వాళ్లు వెదుక్కుంటున్నారు. ల‌క్కీగా టీడీపీ ఆద‌రిస్తే అటు వైపు వెళుతున్నారు. లేదంటే జ‌న‌సేన ఆప్ష‌న్ ను కొంద‌రు ఎంచుకుంటున్నారు. ఆ రెండు పార్టీల్లో స్థానం కూడా లేద‌ని భావించే వాళ్లు అసంతృప్తిగా వైసీపీలో కొన‌సాగుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జ‌ల‌క్ మ‌రవ‌లేనిది. ఆయ‌న అహం మీద దెబ్బ‌వేసిన‌ట్టు అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan MLC) విప‌రీత చ‌ర్య‌ల వైపు వెళ‌తార‌ని పార్టీలోని టాక్‌. అందుకే, అటు వైపు వెళ్ల‌డానికి వైసీపీ శ్రేణులు గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నాయ‌ట‌.

Also Read : Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్