Harsha Kumar: జగనే షర్మిలను కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చేమో..? హర్షకుమార్

  Harsha Kumar: అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్‌ఆర్‌సిపి(ysrcp) శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Jagan May Send Sharmila In Congress

Jagan May Send Sharmila In Congress

 

Harsha Kumar: అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్‌ఆర్‌సిపి(ysrcp) శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదని హర్ష కుమార్ అన్నారు. అలాగే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలను కాదని కొత్తవారికి సీట్లు ఇవ్వకూడదని చెప్పారు. జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని అన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సిపి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని… వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపికి వ్యతిరేకంగా దళితులు ఓట్లు వేయాలని సూచించారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలని అన్నారు.

read also : Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?

అమలాపురం నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేయించుకుంటున్నామని… ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు సర్వేలో తేలితే ఎన్నికల్లో పోటీ చేస్తామని హర్షకుమార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. ఆర్కే వైఎస్‌ఆర్‌సిపి నుంచి వెళ్లిపోవడం, మళ్లీ వైఎస్‌ఆర్‌సిపిలోకి రావడం కూడా జగన్ ప్లానే అని చెప్పారు. షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

  Last Updated: 21 Feb 2024, 01:29 PM IST