Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల‌ను (Jagan-KCR) రాజ‌కీయంగా వేర్వేరుగా చూడలేం.

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 03:38 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల‌ను (Jagan-KCR) రాజ‌కీయంగా వేర్వేరుగా(Politics) చూడలేం. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఉన్న బాండింగ్ చాలా గ‌ట్టిది. హైద‌రాబాద్  లోని ఏపీ స‌చివాల‌యాన్నీ మొద‌టి క‌ల‌యిక‌లోనే కేసీఆర్ కు రాసిచ్చేంత విన‌యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉంది. తెలంగాణ నుంచి రావాల్సిన 6వేల కోట్ల విద్యుత్ బ‌కాయిలను కేసీఆర్ నుంచి తీసుకోలేక కేంద్ర ప్ర‌భుత్వాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ్ర‌యించారు. దాని మీద న్యాయ‌స్థానం మెట్లు ఎక్కారు. ఇక ఆ బ‌కాయిలను అడిగే ద‌మ్ము, ధైర్యం ఏపీ సీఎంకు లేద‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం. అయిన‌ప్ప‌టికీ వాళ్లిద్ద‌రి మ‌ధ్యా(Jagan-KCR)రాజ‌కీయ అవ‌గాహ‌న చాలా మెండుగా ఉంది. తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను కేసీఆర్ ఏ విధంగా ఆడుకుంటోన్నారో, సేమ్ టూ సేమ్ ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,తెలంగాణ సీఎం కేసీఆర్ ల‌ను..(Jagan-KCR)

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఏ పార్టీ ఉండాలో కేసీఆర్ (Jagan-KCR) డిసైడ్ చేస్తారు. బీఆర్ ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం ఏ పార్టీ అనేది క్రియేట్ చేస్తారు. ఆయ‌న సీఎం అయిన త‌రువాత ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీల‌ను నామమాత్రం చేయ‌గ‌లిగారు. వాటి స్థానంలో 2019 ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ ప్ర‌త్యామ్నాయ పార్టీ స్థాయికి తీసుకురాగ‌లిగారు. ఎన్నిక‌ల్లో పోటీ అంతా బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ఉంటుంద‌న్న సంకేతాన్ని ప్ర‌జ‌ల మధ్య‌కు కేసీఆర్ తీసుకెళ్లారు.

Also Read : Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై `సైకో` లాజిక‌ల్ ముద్ర‌! పార్టీ లీడ‌ర్ల వాయిస్ దుమారం!

ఉప ఎన్నిక‌లు జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్, నాగార్జున సాగ‌ర్, మూడు ఎమ్మెల్సీల ఫ‌లితాల‌ను చూశాం. అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆ విష‌యాన్ని అంద‌రూ ఏక‌గ్రీవంగా అంగీక‌రించే వాళ్లు. ఆ త‌రువాత గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల నాటికి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ అవ‌తరించింది. దాని వెనుక కేసీఆర్ రాజ‌కీయ(Politics) చ‌తుర‌త బ‌లంగా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టే పార్టీ బీఆర్ఎస్ అంటూ బ‌ల‌మైన అభిప్రాయాన్ని పీక్ కు తీసుకెళ్లారు. అంటే, ప్ర‌త్యామ్నాయం బీజేపీ అనేది కూడా కేసీఆర్ తెలంగాణ‌లో డిసైడ్ చేస్తున్నార‌న్న‌మాట‌.

ప‌వ‌న్ ప్రోగ్రామ్ కు వైసీపీ హైప్ క్రియేట్.. (Politics)

ఇంచుమించు కేసీఆర్ త‌ర‌హాలోనే ఏపీలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan-KCR) వైసీపీకి ప్ర‌త్యామ్నాయం జ‌న‌సేనా? టీడీపీనా? అనే స్థాయికి తీసుకెళ్లాల‌ని భావించారు. అందుకే, ప‌వ‌న్ క‌ల్యాణ్ నెల‌కో, రెండు నెల‌ల‌కో ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని పెట్టిన‌ప్పుడ‌ల్లా రాజ‌కీయ దుమారం రేప‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నించేది. గ‌త మూడేళ్లుగా క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ చేసిన కార్య‌క్ర‌మాల‌ను వేళ్ల మీద లెక్కపెట్టుకోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ, టీడీపీ కంటే ఎక్కువ‌గా ఫోక‌స్ అయ్యేలా గేమాడారు. గ‌త ఏడాది రోడ్ల మ‌ర‌మ్మ‌తుకు గాంధేయ మార్గాన ప‌వ‌న్ పిలుపుకు ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇవ్వొచ్చు. కానీ, చివ‌రి నిమిషం వ‌ర‌కు అనుమ‌తులు నిరాకరించ‌డం ద్వారాప‌వ‌న్ ప్రోగ్రామ్ కు వైసీపీ హైప్ క్రియేట్ చేసింది. ఆ త‌రువాత గుడివాడ వెళ్లిన సంద‌ర్భంగా ప‌వ‌న్ స‌భ‌ను హైలెట్ చేసేలా వైసీపీ లీడ‌ర్లు వ్య‌వ‌హరించారు. ఇటీవ‌ల జ‌రిగిన కూల్చివేత‌ల క్ర‌మంలో ఒక గ్రామానికి ప‌వ‌న్ వెళ్లిన‌ప్పుడు కూడా పెద్ద ఎత్తున జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్యాచ్ హైప్ క్రియేట్ చేసింది.

సీఎం ప‌ద‌వి షేరింగ్ వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ ఆశ‌ప‌డే స్థాయికి..

తాజాగా `వారాహి` వాహ‌నం అంశాన్ని విస్తృత ప్ర‌చారంలోకి వైసీపీ వ్యూహాత్మ‌కంగా తీసుకెళ్లింది. ప‌వ‌న్ బ‌స్సు యాత్ర ఇంకా ప్రారంభం కాకుండానే లోకేష్ యువ‌గ‌ళం కంటే హైప్ అయ్యేలా వైసీపీ మంత్రులు, లీడ‌ర్లు విమ‌ర్శ‌ల‌కు దిగారు. అంతేకాదు, స్థానిక సంస్థ‌ల ఎన్నిల‌క‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌ను వైసీపీ టార్గెట్ చేసింది. స్వ‌చ్చంధంగా త‌ప్పుకునేలా టీడీపీ అభ్య‌ర్థుల మీద సామ‌దాన‌దండోపాయాల‌ను ప్ర‌యోగించారు. వాళ్ల స్థానంలో జ‌న‌సేన అభ్యర్థుల‌ను ప్రోత్స‌హించారు. ఫ‌లితంగా జ‌న‌సేన కూడా ఏపీలో బ‌లప‌డింద‌న్న సంకేతాన్ని వైసీపీ వ్యూహాత్మ‌కంగా(Politics) తీసుకెళ్లింది. ఇప్పుడు పొత్తుల్లో సీఎం ప‌ద‌వి షేరింగ్ వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ ఆశ‌ప‌డే స్థాయికి వెళ్లింది. అనివార్యంగా టీడీపీ జ‌న‌సేన మీద ఆధార‌ప‌డేలా వైసీపీ చేయ‌గ‌లిగింది.

Also Read : KCR Before : ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ ర‌ద్దు లేన‌ట్టే!ముంద‌స్తుకు `గుత్తా` ప‌రోక్ష సంకేతం!

ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు మీద వైసీపీ క‌న్నేసింది. వాళ్లిద్ద‌రూ క‌లిసి వెళ్ల‌కుండా ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ తాజాగా పొత్తుల మీద స్పందించారు. బీజేపీ, జ‌న‌సేన పొత్తు మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్పారు. మూడో పార్టీకి(టీడీపీ) పొత్తు అవకాశం లేద‌ని తేల్చి చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే, మూడు పార్టీలు కలిసిన‌ప్ప‌టికీ సింహం సింగిల్ అంటూ చ‌ర్చకు తెర‌లేపేలా రాజ‌కీయ(Politics) వ్యూహాన్ని వైసీపీ ర‌చించింది. ఫ‌లితంగా టీడీపీ కంటే చాలా బ‌ల‌మైన పార్టీగా వైసీపీని సామాన్యుల్లోకి తీసుకెళ్లారు. ఇదే, అస‌లు సిస‌లైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైండ్ గేమ్‌. ఇలాంటి రాజ‌కీయాన్ని కేసీఆర్ నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అందిపుచ్చుకున్నారు. వాళ్లిద్ద‌రి రాజ‌కీయ వ్యూహాలను గ‌మ‌నిస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఒకేలా న‌డిపిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌త్యామ్నాయ పార్టీ ఏది ఉండాలో కూడా కేసీఆర్, జ‌గ‌న్ (Jagan-KCR) నిర్ణ‌యించేలా భ‌యంక‌రమైన చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వాళ్ల మాయంలో ప‌డిన కాంగ్రెస్ తెలంగాణ‌లో బ‌ల‌హీన‌ప‌డింది. ఏపీలో జ‌న‌సేన లేకుండా టీడీపీ ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న వేసుకునేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాన్ని న‌డిపారు.

Also Read : Janasena : ప‌వ‌న్ CM కోసం హ‌రిరామ‌జోగయ్య `వెట‌ర‌న్` పాలిటిక్స్