Site icon HashtagU Telugu

Jagan jail : జ‌గ‌న్ జ‌మానాలో అధికారుల‌కు జైలు శిక్ష‌, క్ష‌మాప‌ణ‌తో తీర్పు స‌వ‌ర‌ణ‌

Jagan

Jagan Telangana High Court

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో మ‌రోసారి ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు జైలు శిక్ష(Jagan jail) ప‌డింది. ఆ మేర‌కు ఏపీ హైకోర్టు(High court)బుధ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆగ్ర‌హించింది. అందుకు కార‌కులైన ఉన్న‌తాధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

జైలు శిక్ష వేయ‌డం జ‌గ‌న్ పాల‌నా వైఫ‌ల్యానికి(Jagan jail)..

విద్యాశాఖలో సర్వీస్ అంశంలో తీర్పును అమ‌లు చేయ‌లేద‌ని ఆగ్ర‌హిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు రాజశేఖర్, రామకృష్ణకు 2 నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హైకోర్టు మెట్లు ఎక్కారు. ప‌లు సంద‌ర్భాల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. చీఫ్ సెక్ర‌ట‌రీ , డీజీపీ హోదాల్లోని అధికారులు హైకోర్టు ముందు లెంప‌లు వేసుకోవ‌డాన్ని చూశాం. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌కు జీ హుజూర్ అంటూ కొంద‌రు ఉన్న‌తాధికారులు చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం పరిపాటి అయింది. అలాంటి వాళ్ల‌కు జైలు శిక్ష మిన‌హా మ‌రొక ప‌రిష్కారం లేద‌ని భావిస్తూ బుధ‌వారం ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు జైలు శిక్ష వేయ‌డం జ‌గ‌న్ పాల‌నా వైఫ‌ల్యానికి(Jagan jail) నిద‌ర్శ‌నంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : AP High Court : జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన అంశంపై ఉద్యోగులు హైకోర్టు(High court)ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయకపోవడంతో బుధవారం ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి. ఇంతకముందు ఇచ్చిన హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు స‌రైన స‌మాధానం అధికారుల నుంచి రాక‌పోవ‌డంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించ‌డం జ‌గ‌న్ హ‌యాంలోని మ‌రో పరాకాష్ట‌.

జైలు శిక్ష విధించగా క్షమాపణ కోరడంతో తీర్పును సవరిస్తూ..

అయితే, ఇద్ద‌రు అధికారుల క్షమాపణతో తీర్పును హైకోర్టు స‌వ‌రించింది. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించిన కేసులో ఏపీకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు రాజశేఖర్‌, రామకృష్ణలకు విధించిన జైలు శిక్షను ఏపీ హైకోర్టు తగ్గించింది. బుధవారం ఉదయం వీరిద్దరిపై ఏపీ హైకోర్టు నెలరోజుల పాటు జైలు శిక్ష విధించగా క్షమాపణ కోరడంతో ఉదయం ఇచ్చిన తీర్పును సవరిస్తూ మరో తీర్పును ఇచ్చింది. అయితే ఇద్దరు అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కోర్టులో నిలబడి ఉండాలని ఆదేశించ‌డం జ‌గ‌న్ జ‌మానాలో అధికారుల వాల‌కాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

Also Read : AP High Court: జగర్ సర్కార్ కు ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!!

Exit mobile version