Jagan : తాడేప‌ల్లిలో పోస్టుమార్టం,ఏ క్ష‌ణ‌మైన ఢిల్లీకి జ‌గ‌న్?

ఢిల్లీ వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రెండు రోజులుగా షెడ్యూల్ ను

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 02:43 PM IST

ఢిల్లీ వెళ్ల‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స‌న్నాహాలు చేసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న షెడ్యూల్ ను తాడేప‌ల్లికి (Tadepalli)ప‌రిమితం చేసుకున్నారు. ప్ర‌తి ఏడాది లండ‌న్ వెళ్లే విహార‌యాత్ర‌ను కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ర‌ద్దు చేసుకున్నారు. అనంత‌పురం జిల్లాలో `బ‌ట‌న్ నొక్కే` కార్య‌క్ర‌మాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. అందుబాటులో ఉండే తాడేప‌ల్లి కోట‌రీతో ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నారు. ఎప్పుడూ నిశ్చింతంగా ఉండే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి క‌ల‌వ‌రప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే, మంగ‌ళ‌వారం కూడా వివేకానంద హ‌త్య కేసు విచార‌ణ‌, కోడిక‌త్తి కేసుల‌పై కీల‌క నేత‌ల‌తో రివ్యూ పెట్టార‌ట‌.

ఢిల్లీ వెళ్ల‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు (Jagan)

సుప్రీం, హైకోర్టుల్లోని కేసులు, విచార‌ణ అంశాల‌పై ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) సీరియ‌స్ గా దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. అనూహ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచింద‌ని స‌మాచారం. అందుకే, ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారం కోసం మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక‌, జోతిష్య పండితుడ్ని రంగంలోకి దించార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌ముఖుల‌తో ఫోటోలు దిగిన ఆ పండితుడు ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు లైజ‌నింగ్ చేస్తున్నార‌ని టాక్‌. గ‌తంలోనూ గాలి జ‌నార్థ‌న్ రెడ్డి బెయిల్ విష‌యంలో ప‌ట్టాభి అనే జ‌డ్జిని లోబ‌రుచుకునే ప‌య‌త్నం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ఆనాడున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ జ‌డ్జిని ఏసీబీకి ప‌ట్టించారు. అప్ప‌ట్లో న్యాయ వ్య‌వ‌స్థ లోప‌ల జ‌రిగే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఇదే అంశం తెర‌మీద‌కు

ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ర‌హాలో విజ‌య‌కుమార్ అనే జ్యోతిష్య పండితుడు శాస‌న‌, న్యాయ‌, నిర్వ‌హ‌ణ‌, మీడియా వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌డానికి రంగంలోకి దిగాడ‌ని సోషల్ మీడియాలోని దుమారం. ఈ కేసుల నుంచి అత‌ను బ‌య‌ట‌ప‌డేస్తాడ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్(Tadepalli) న‌మ్ముతుంద‌ని ప్ర‌త్య‌ర్థుల భోగ‌ట్టా. కానీ, తొలి నుంచి కేసుల విష‌యంలో ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) తీసుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న అంశం. ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఇదే అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్పుడు కూడా ఆ పెద్ద‌ల ద్వారా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ ప‌క్క‌దోవ ప‌ట్టేలా చేస్తార‌ని విప‌క్షాల అనుమానం. ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్నామ‌ని న‌మ్ముతున్నారు.

పొలిటిక‌ల్  మంత్రాంగం(Tadepalli)

సుప్రీం కోర్టు ఆదేశం మేర‌కు ఈనెలాఖ‌రు నాటికి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ పూర్తి చేయాలి. అందుకోసం ప్ర‌త్యేక టీమ్ ను కూడా విచార‌ణ కోసం సుప్రీం ఏర్పాటు చేసింది. ఆ క్ర‌మంలో ఆదివారం భాస్క‌ర్ రెడ్డి అరెస్ట్ జ‌రిగింది. ఆయ‌న్ను క‌డ‌పలో అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ చెంచ‌ల్ గూడ జైలుకు పంపారు. నెక్ట్స్ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. దానికి త‌గిన విధంగా అవినాష్ కూడా ముంద‌స్తు బెయిల్ కు పిటిష‌న్ వేశారు. సీఆర్పీసీ 160 నోటీసులు జారీ చేసిన సీబీఐ అరెస్ట్ చేస్తుంద‌ని ముందుగానే గ్ర‌హించారు. అందుకే, పిటిష‌న్ వేయ‌డం ద్వారా సోమ‌వారం అరెస్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ లోపు పొలిటిక‌ల్ (Tadepalli)మంత్రాంగం మ‌లుపులు తిరుగుతోంది.

Also Read : Jagan : TDP నేత బీటెక్ ర‌వి భ‌ద్ర‌త‌కు ముప్పు, CBN ఆందోళ‌న‌

కేసులు, అరెస్ట్ లు కార‌ణంగా రాజ‌కీయ న‌ష్టం జ‌ర‌గ‌కుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే, పులివెందుల‌లో శాంతి ర్యాలీలు చేసేలా క్యాడ‌ర్ కు డైరెక్ష‌న్ ఇచ్చారు. ఒక వేళ అవినాష్ అరెస్ట్ అయితే, గంద‌ర‌గోళం రేగుతుంద‌ని ముందుగానే శాంతి ర్యాలీ వైసీపీ చేసింది. శాంతి ర్యాలీల ద్వారా ప్ర‌జ‌ల్లో ఉద్రేకం రేగ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.అదే స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ వేగంగా ముగించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీలున్నంత వ‌ర‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను కార్న‌ర్ చేసేలా ఎత్తుగ‌డ వేస్తున్నారు. అందులో భాగంగా తాడేపల్లి కేంద్రంగా కీల‌క నేత‌ల‌తో స‌మావేశాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. మీడియా ముందు ఎవ‌రు ఏమి మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే అంశంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేశార‌ట‌.

Also Read : YS Jagan: సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ జ‌రుగుతోన్న సమ‌యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్య‌వ‌హారం వైసీపీలో ఆందోళ‌న కలిగిస్తోంది. ఆ క్ర‌మంలో మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ప్ర‌సాద్ రెడ్డి సీబీఐ విచార‌ణ‌పై మాట్లాడ‌డాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు టార్గెట్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన జ‌గ‌న్మోహన్ రెడ్డి(Jagan) లీడ‌ర్ల‌కు దిశానిర్దేశం ఇస్తున్నారు. ఎవ‌రిప‌డితే, వాళ్లు మాట్లాడ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. క్యాడ‌ర్ కూడా ఉద్రేకంగా రోడ్ల మీద‌కు రాకుండా అప్ర‌మ‌త్తం అవుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే అవినాష్ అరెస్ట్ కావ‌డం త‌థ్య‌మా? అనే ఆలోచ‌న కూడా వ‌స్తోంది. ఒక‌వేళ విచార‌ణ చేయిదాటి పోతే అత్య‌వ‌స‌రంగా ఢిల్లీ వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్దం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.