Jagan : అవినాష్ రెడ్డికి చెక్, తెర‌పైకి జ‌గ‌న్ మ‌రో బ్ర‌ద‌ర్

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఫ‌క్తు రాజ‌కీయవేత్త‌. ఎప్పుడూ ప్లాన్ ఏ , ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా ఆయ‌న వ‌ద్ద ఉంటుంద‌ని అంటారు.

  • Written By:
  • Publish Date - April 27, 2023 / 05:31 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఫ‌క్తు రాజ‌కీయవేత్త‌. ఎప్పుడూ ప్లాన్ ఏ , ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా ఆయ‌న వ‌ద్ద ఉంటుంద‌ని అంటారు. తాడేప‌ల్లి కోట‌లో ఎప్పుడూ రాజ‌కీయాల గురించే ఆలోచిస్తార‌ట‌. అందుకోసం ఎవ‌ర్నైనా ప‌క్క‌న పెడ‌తారు. అవ‌స‌ర‌మైతే ఎవ‌ర్నైనా తెర మీద‌కు తీసుకొస్తారట‌. జీరోల‌ను హీరోల‌ను చేసినా, హీరోల‌ను జీరో చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ‌క్తు రాజ‌కీయాల‌కు మాత్రమే చెల్లుతుంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోని కొంద‌రి అభిప్రాయం. అందుకే, ఆయ‌న వ‌ద్ద ఎలా అణిగిమ‌ణిగి ఉండాలంటారు. ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా, ఇబ్బంది అనిపించినా వెంట‌నే సొంత వాళ్ల‌నైనా జీరోల‌ను చేస్తార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ‌క్తు రాజ‌కీయవేత్త‌ (Jagan)

ఒకప్పుడు విజ‌య‌సాయిరెడ్డి(Vijayasai Reddy) వైసీపీలో హీరో. ఆయ‌న లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయం లేదు. కంపెనీలు పెట్టించినా, క్విడ్ ప్రో కో దారి చూపించినా, స్టాక్ మార్కెట్లో సూట్ కంపెనీల క్రియేష‌న్ త‌దిత‌రాల‌న్నీ సాయిరెడ్డికి తెలియ‌కుండా జ‌రిగినవి కాదు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan)తో పాటు ఏ2గా ఆయ‌న జైలుకు వెళ్లారు. ఒక‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కేవీపీ ఎలా ఉండే వాళ్లో, అలాగ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, సాయిరెడ్డి ఉంటార‌ని వైసీపీలో వినిపించేది. ఆ దిశ‌గా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా స‌ఖ్య‌త న‌డిచింది. ఎందుకో సాయిరెడ్డి మీద అనుమానం వ‌చ్చింది. వెంట‌నే ప‌వ‌ర్స్ క‌ట్ చేశారు. విశాఖ‌ప‌ట్నం నుంచి తాడేప‌ల్లికి తీసుకొచ్చారు. కానీ, అక్క‌డ కూడా జీరోను చేశారని వైసీపీలోని చ‌ర్చ‌.

ఒకప్పుడు విజ‌య‌సాయిరెడ్డి వైసీపీలో హీరో

ఇలాంటి సంఘ‌ట‌న‌లు చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహ‌ణ‌ల‌ను తీసుకుంటే, కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని(kodali nani) ఎగిరెగిరి ప‌డ్డారు. మంత్రి హోదాలో కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా బూతులు వినిపించారు. ప్ర‌త్య‌ర్థుల మీద తురుపు ముక్క‌గా కొన్ని రోజులు ఆయ‌న్ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాడారు. ఎంత వాడుకోవాలో, అంత వాడేసిన త‌రువాత మంత్రి ప‌ద‌విని ఊడ‌గొట్టి గొడ్ల చావిడికి పంపారు. అయినా, కిక్కురుమ‌న‌కుండా ఆయ‌న చుట్టూ అప్ప‌టికే సాలెగూడును తాడేప‌ల్లి కోట‌రీ అల్లేసింది. ఇక మ‌రో మాజీ మంత్రి పేర్ని నాని(Parni nani) ప‌రిస్థితి అంతే. సాక్షాత్తూ వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ భేష‌ర‌తుగా ప‌ద‌వికి రాజీనామా చేసి శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చేసిన ఎపిసోడ్ అద్భుతం. ఇక జైలులో ఉన్న‌ప్పుడు అన్న‌కు అండ‌గా నిలిచిన చెల్లెలు ష‌ర్మిల‌ను జీరో చేయ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే (Jagan) చెల్లింది. ఇవ‌న్నీ మ‌చ్చుకు జీరో స్థాయికి తీసుకొచ్చిన సంఘ‌ట‌న‌లు.

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చిక్కుల్లో

ఇక జీరోగా ఉండే బాప‌ట్ల‌కు చెందిన నందిగాం సురేష్ ను(nandigam Suresh) క‌ల‌లో కూడా ఊహించిన విధంగా ఆయ‌న్ను ఎంపీ చేశారు. అలాగే, ఒక సాధార‌ణ ఫిజియోథెర‌పిస్ట్ గురుమూర్తిని(Gurumurthy) తిరుప‌తి ఎంపీగా నిల‌బెట్టారు. అనూహ్యంగా తొలి క్యాబినెట్ లోనే సుచ‌రిత,(Sucharitha) పాముల పుష్ప శ్రీవాణి,(PushpaSrivani) విడ‌ద‌ల ర‌జిని(vidudala Rajani) త‌దిత‌రుల‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్లారు. ఇలా, ఎప్పుడు ఎలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాలు తీసుకుంటారు? అనేది ఇతిమిద్ధంగా చెప్ప‌లేం. ఇదంతా ఎందుకంటే, ఇప్పుడు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చిక్కుల్లో ఉన్నారు. ఆయ‌న అరెస్ట్ అయితే, వ‌చ్చే ప‌రిణామాల‌ను ముందుగానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) గ్ర‌హించార‌ట‌. ఒక వేళ ఆయ‌న జైలుకు వెళితే, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాలి. అప్పుడు ఉప ఎన్నిక‌లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని ఒక టాక్. అందుకే, ప్లాన్ బీని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం చేశార‌ట‌.

అవినాష్ రెడ్డి  స్థానాన్ని దుష్యంత్ రెడ్డి ద్వారా భ‌ర్తీ

ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి (Avinash Reddy) రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బందులు అల్లుకుంటున్నాయి. అందుకే, నైస్ గా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేయ‌డానికి ప్లాన్ బీని సిద్ధం చేశారట‌. ప్ర‌త్యామ్నాయంగా దుష్యంత్ రెడ్డిని(Dushyanth Reddy) తెర‌మీద‌కు తీసుకొస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న క‌మలాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం తాటిమాకుల‌ప‌ల్లె దుష్యంత్ రెడ్డి స్వ‌గ్రామం.కమ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగా తెలుసు. 2019లో జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా ప‌నిచేశారు. 2009లోనే దుష్యంత్ రెడ్డి క‌మ‌లాపురం టికెట్‌ ఆశించారు. ఈసారి ఖ‌చ్చితంగా టిక్కెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి కేసులో ఇరుక్కున్నారు. దీంతో ఆయ‌న స్థానాన్ని దుష్యంత్ రెడ్డి ద్వారా భ‌ర్తీ చేస్తార‌ని వినికిడి.

Also Read : Jagan : జ‌గ‌న్ కు పులిలా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబు

పారిశ్రామికవేత్త అయిన దుష్యంత్ రెడ్డి అప్ప‌ట్లో క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరిగారు. వీర‌శివారెడ్డికి వైఎస్సార్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల కంటే అత‌నైతే ఉత్తమమని వైసీపీ నేతలు భావిస్తున్నారట. సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా సమీపిస్తుండగా.. దుష్యంత్‌రెడ్డి(Dushyanth Reddy) పేరు తెర‌పైకి రావ‌డం క‌డ‌ప జిల్లాలో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారుతోంది. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) స‌మ‌యానుకూలంగా ఫ‌క్తు రాజ‌కీయాల‌ను ఎలా న‌డుపుతారు? అనేందుకు ఈ ఎపిసోడ్ ఒక నిద‌ర్శ‌నంగా నిల‌వ‌నుంది.

Also Read : Jagan Reform : ఉచిత విద్య‌, వైద్యం దిశ‌గా సంస్క‌ర‌ణ‌లు