Jagan : కార్యకర్తల కోసం ప్ర‌త్యేక‌ యాప్‌ ను తీసుకొస్తున్న జగన్

Jagan : రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్రమంగా వేధింపులకు గురవుతున్నారని ఆరోపించిన జగన్, త్వరలో ఓ ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Jagan App

Jagan App

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్రమంగా వేధింపులకు గురవుతున్నారని ఆరోపించిన జగన్, త్వరలో ఓ ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడ అధికారుల చేతనైనా, పాలకుల చేతనైనా అన్యాయానికి గురవుతున్నారో తేల్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

‘LEAP’ Schools : ఏపీలో ‘లీప్’ పాఠశాలలతో విద్యలో నూతన మార్గదర్శకత్వం

ఈ యాప్‌ ద్వారా కార్యకర్తలు తమకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరూ ఎలాంటి అధికారుల చేత వేధింపులకు గురవుతున్నారో వివరాలు నమోదు చేయడం ద్వారా, వాటికి సంబంధించిన ఆధారాలను అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. ఈ సమాచారమంతా వైఎస్సార్‌సీపీ డిజిటల్ లైబ్రరీలోని సర్వర్‌లో భద్రపరచబడుతుంది. రేపు తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినపుడు, ఈ డేటాను ఆధారంగా తీసుకుని బాధ్యులైన అధికారులను చట్టం ముందు నిలబెడతామని జగన్ స్పష్టం చేశారు.

New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన

తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తున్నారు అని ఆరోపించారు. మిధున్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి నాయకుల ఉదాహరణలు ఉటంకిస్తూ, వారికి జరిగిన అన్యాయం ప్రజలందరికి తెలియజేశారు. వారిని తప్పుడు కేసుల ద్వారా జైళ్లకు పంపడం పాలక కూటమి నీచ రాజకీయాల లక్షణమని విమర్శించారు.

  Last Updated: 29 Jul 2025, 09:13 PM IST