Jagan in Trouble : చంద్రబాబుకు సానుభూతి వెల్లువ‌, సీ ఓట‌ర్ స‌ర్వే తేల్చివేత‌

Jagan in Trouble: జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైండ్ బ్రాంక్ అయ్యేలా సీ ఓట‌ర్ స‌ర్వే ఫ‌లితం ఉంది. వైసీపీలోని 64శాతం అరెస్ట్ ను వ్య‌తిరేకించ‌డం

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 02:06 PM IST

Jagan in Trouble: ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైండ్ బ్రాంక్ అయ్యేలా సీ ఓట‌ర్ స‌ర్వే ఫ‌లితం ఉంది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో చంద్ర‌బాబును పెట్టిన త‌రువాత వివిధ పార్టీల అభిప్రాయాన్ని సేక‌రించింది. వైసీపీలోని 64శాతం మంది చంద్ర‌బాబు అరెస్ట్ ను వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. తెలుగుదేశం పార్టీలోని 85శాతం మంది రాబోవు ఎన్నిక‌ల్లో ఈ అరెస్ట్ సానుభూతిని క్రియేట్ చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేవ‌లం 36శాతం మంది వైసీపీ లీడ‌ర్లు ఈ అరెస్టు జగన్ రెడ్డికి ఎన్నిక‌ల్లో క‌లిసొస్తుంద‌ని భావించార‌ని స‌ర్వే తేల్చింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు బీజేపీ లీడ‌ర్లు ఈ అరెస్టు ఎన్నిక‌ల్లో చంద్రబాబు నాయుడుకు సహాయపడుతుందని అభిప్రాయ‌ప‌డ్డార‌ని స‌ర్వే చెబుతోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైండ్ బ్రాంక్ అయ్యేలా సీ ఓట‌ర్ స‌ర్వే (Jagan in Trouble)

ఏపీలోని 53 శాతానికి పైగా చంద్ర‌బాబు అరెస్ట్ ను వ్య‌తిరేకిస్తున్నార‌ని సీవోటర్ సర్వే తేల్చింది. వైసీపీకి చెందిన ప్ర‌తి పది మందిలో నలుగురు చంద్ర‌బాబు అరెస్ట్ ను వ్య‌తిరేకిస్తూ సానుభూతిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ పరిణామం రాబోవు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. మొత్తం వైసీపీలోని 1,809 మంది ద్వారా అభిప్రాయాల‌ను ఆ స‌ర్వే సంస్థ తెలుసుకుంది. సానుభూతి చంద్ర‌బాబు ప‌ట్ల పెరుగుతుంద‌ని స‌ర్వేల సారాంశం. స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసులో చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఐ ప్యాక్ ద్వారా స‌ర్వే చేయించార‌ట‌. ఆ స‌ర్వేలోనూ సానుభూతి ఎక్క‌వ‌గా చంద్ర‌బాబుకు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు అరెస్ట్ చేసిన త‌రువాత సానుభూతి క్రియేట్

ఇటీవ‌ల ఇండియాటుడే సీ ఓట‌ర్ స‌ర్వే ఫ‌లితాల ఆధారంగా టీడీపీ 15 నుంచి 18 ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. అలాగే, ఎమ్మెల్యే సీట్ల‌ను 110 వ‌ర‌కు గెలుచుకుంటుంద‌ని స‌ర్వేలో తేలిన ఫ‌లితం. ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన పొత్తు కూడా ఖ‌రారు అయింది. ఆ రెండు పార్టీలు క‌లిసి వెళితే, మ‌రిన్ని సీట్లు గెలిచే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒంట‌రిగా వెళ్లిన‌ప్ప‌టికీ క‌నీసం 100 సీట్ల‌కు త‌గ్గ‌కుండా గెలుచుకుంటుంద‌ని జాతీయ స‌ర్వేలు చెప్పే అంచ‌నా. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయ‌ని, చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన త‌రువాత సానుభూతి క్రియేట్ అయింద‌ని స‌ర్వేల సారంశం. ఫ‌లితంగా 120 స్థానాల వ‌ర‌కు టీడీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా. ఇక జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు మ‌రింత క‌లిసొచ్చే అంశంలా క‌నిపిస్తోంది. ఆ రెండు పార్టీలు క‌లిసి క‌నీసం 140 స్థానాల వ‌ర‌కు గెలుచుకుంటాయ‌ని అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Rajahmundry Jail : చంద్రబాబు ను జైల్లోనే అంతం చేసేందుకు కుట్ర – నారా లోకేష్ సంచలన ట్వీట్

వైనాట్ 160 దిశ‌గా చంద్ర‌బాబు నాయుడు చాలా కాలంగా స్కెచ్ వేశారు. ఆ దిశ‌గా దూకుడుగా వెళుతున్నారు. ఒకానొక సంద‌ర్భంగా వై నాట్ పులివెందుల స్థాయికి వెళ్లారు. అక్క‌డ మీటింగ్ లు పెట్టారు. సూప‌ర్ హిట్ కావ‌డంతో వైసీపీ సైతం విస్మ‌యానికి గుర‌య్యింది. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రాబోవు ఎన్నిక‌ల్లో వైసీపీని దెబ్బ‌తీస్తుంద‌ని అంచ‌నా వేశారు. అంతేకాదు, వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత ను కూడా టీడీపీలో చేర్చుకోవ‌డానికి రంగం సిద్ధ‌మ‌యింది. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అభ‌ద్ర‌తా భావం పెరిగింద‌ని విప‌క్షాలు చేసే విమ‌ర్శ‌. రాబోవు ఎన్నిక‌ల్లో ఎలాగూ గెలిచే అవ‌కాశం లేద‌ని భావించిన ఆయ‌న త‌న‌లోని కోర్కెల‌ను తీసుకునే క్ర‌మంలో చంద్ర‌బాబును జైలుకు పంపించార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. అందుకే, ఇప్పుడు రామోజీరావు, లోకేష్‌, మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును కూడా త్వ‌ర‌గా అరెస్ట్ చేయండ‌ని చెబుతున్నార‌ని భావిస్తున్నారు. వాళ్లు భావిస్తోన్న విధంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభ‌ద్ర‌తా భావానికి సీ ఓట‌ర్ స‌ర్వే పుండుమీద కారంలా మారింది.

Also Read : Rahul Gandhi : రైల్వే కూలీగా మారిన రాహుల్ గాంధీ