Jana Sena Foundation Day : జన్మలో జగన్..పవన్ తో పెట్టుకోడు

Jana Sena Foundation Day : పవన్ సత్తా ఏంటో 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించేసరికి అన్ని మూసుకొని బెంగుళూర్ , తాడేపల్లి చక్కర్లు కొడుతున్నాడు

Published By: HashtagU Telugu Desk
Pawan Jagan

Pawan Jagan

Jana Sena Foundation Day : వైసీపీ నేతలు , ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఎన్ని మాటలు అనాలో అన్ని అనేశాడు. ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎన్నో విమర్శలు చేసాడు. కానీ పవన్ సత్తా ఏంటో 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించేసరికి అన్ని మూసుకొని బెంగుళూర్ , తాడేపల్లి చక్కర్లు కొడుతున్నాడు.

జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించినప్పటి నుంచి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయాలకు పనికిరారని, అసెంబ్లీ గేటు తాకలేరని చేసిన విమర్శలను తట్టుకుని, తన పట్టుదల, ప్రజాప్రేమ ద్వారా జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తూ, జనసేన కార్యకర్తలకు అండగా నిలిచి, ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, వెనక్కి తగ్గకుండా మరింత బలంగా తిరిగి రావాలని సంకల్పించారు.

Jana Sena 12th Foundation Day : జనసేన విజయం వెనుక అసలు కారణాలు ఇవే

2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేసి 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, అన్నింటిలోనూ ఘన విజయం సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ నాయకత్వ దక్షతను నిరూపించే ఘట్టమని చెప్పుకోవచ్చు. ఎక్కడా రాజీపడకుండా ప్రజల కోసం చేసిన నిరంతర పోరాటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా తెచ్చిన ఐక్య కూటమి ఈ విజయానికి ప్రధాన కారణమయ్యాయి. వైసీపీ నాయకులు జనసేనను అణగదొక్కాలని అనుకున్నప్పటికీ, జనసేన సునామీ రూపంలో వారిని ఓడించి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా మారింది.

ఈ ఘన విజయంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాజకీయ ప్రస్థానం నిరూపించినది ఒక్కటే – ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన నాయకత్వం. అసెంబ్లీ గేటు తాకలేరని విమర్శించినవాళ్లే ఇప్పుడు ఆయనను డిప్యూటీ సీఎంగా చూడాల్సిన స్థితి వచ్చింది. నిజాయితీ, నిబద్ధత, పట్టుదలతో రాజకీయాల్లో నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరింత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. పవన్ సత్తా చూసిన జగన్ ఇక జన్మలో పవన్ జోలికి రాడు.

  Last Updated: 14 Mar 2025, 12:00 PM IST