Site icon HashtagU Telugu

AP Caste Census : వచ్చే నెల నుంచి కులగణన.. జగన్ సర్కారు సన్నాహాలు

Cm YS Jagan

Ap Cm Jagan

AP Caste Census : రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అది కేంద్రం పరిధిలోని అంశం అని వాదిస్తోంది. ఇటీవల బీహార్ సర్కారు కులగణన నిర్వహించకుండా అడ్డుకునేందుకు కేంద్ర సర్కారు న్యాయపోరాటం కూడా చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు కులగణన నిర్వహించేందుకు రెడీ అవుతోంది. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.  ఆరు నెలల్లోగా కులగణన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. కులగణన సర్వేలో వాలంటీర్లను దూరం పెట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే నిర్వహిస్తారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో.. వాలంటీర్ల సేవలను కులగణలో వాడుకోవడం లేదని తెలుస్తోంది. కులగణన చేసేందుకు ఓ యాప్‌ను కూడా ఏపీ సర్కారు అందుబాటులోకి తీసుకురానుంది.

We’re now on WhatsApp. Click to Join.

కులగణన ద్వారా సేకరించే సమాచారాన్ని 3 దశల్లో రీవేరిఫై చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండలస్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ పరిధిలోని 10 శాతం చొప్పున ఇళ్లల్లో ఈ రీ వెరిఫికేషన్ జరుగుతుంది. రెండో లెవల్ లో రీ వెరిఫికేషన్‌ బాధ్యతలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు అప్పగిస్తారు. మూడో స్థాయిలో రీ వెరిఫికేషన్ అనేది ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరుగుతుంది. కులగణనను ప్రారంభించడానికి ముందు రాష్ట్రంలోని కుల సంఘాల ప్రతినిధులతో ఏపీ సర్కారు సమావేశాలు నిర్వహించబోతోంది. ఈసందర్భంగా వారి నుంచి సలహాలు, సూచనలను (AP Caste Census) స్వీకరిస్తారు.

Also Read: Fasting: ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో మీకు ఆకలిగా అనిపిస్తే.. ఇలా చేయండి..?