దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతీ, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సమాధిపై చేయిపెట్టి తండ్రి ఆశీస్సులు తీసుకున్న జగన్, అనంతరం తన ఎక్స్ (Twitter) ఖాతాలో “Miss you Dad” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
Kovur : వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ మరింత కోలాహలంగా మారింది. జననేతను ఒక్కసారి చూడాలని, చేతులు కలిపేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు. జగన్ తండ్రి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం, అభిమానుల్లో గాఢమైన భావోద్వేగాన్ని రేకెత్తించింది. వైఎస్ కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి అర్పించడంతోపాటు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘాటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబానికి ప్రజల నుండి అందిన స్పందన ఎంతో చక్కగా కనిపించింది.
ఇటు ఇదే సందర్బంగా కడప జిల్లాలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు జగన్‌ను కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులకు, సమస్య పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని జగన్ హామీ ఇచ్చారు. “విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న నేటి ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడం బాధాకరం. వైఎస్సార్సీపీ విద్యార్థులకు అండగా ఉంటుంది,” అని జగన్ తెలిపారు.
Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025