Site icon HashtagU Telugu

Jagan : రాయి తగలడం తో జగన్ అంత మరచిపోతున్నాడా..? దీనికి కారణం పవన్ ఫై చేసిన కామెంట్లే..!!

Jagan Kakinda

Jagan Kakinda

వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) కు ఏమైంది..? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు..? స్క్రిప్ట్ లో ఆలా రాసి ఇచ్చారా..? లేక ఆయనే సొంతగా మాట్లాడుతున్నారా..? రాయి నిజంగా అంత బాగా తగిలిందా..? రాయి తగలడం తోనే ఇలా మాట్లాడుతున్నాడా..? లేక ఎన్నికల్లో ఓటమి పాలవుతాం అనే భయంతో ఇలా మాట్లాడుతున్నాడా..? అని ఇప్పుడు జనసేన శ్రేణులే కాదు వైసీపీ శ్రేణులు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు.

వారం రోజుల క్రితం జగన్ ఫై సతీష్ అనే యువకుడు రాయి (Stone Attack) విసరడంతో ఆయన కనుబొమ్మ ఫై గాయమైంది. ఓ రోజు రెస్ట్ అనంతరం మళ్లీ తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఫై చేసే విమర్శలు చేసే క్రమంలో ఎక్కువగా తడబడుతున్నాడు. తనకు తానే తక్కువ చేసుకుంటున్నాడా అనే విధంగా స్పీచ్ ఇస్తున్నాడు. ఇక నిన్న కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో చాల పొరబాటు వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా లో విమర్శల పాలవుతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గతంలో పాలకొల్లులో పోటీ చేసాడు.. పిఠాపురం ఆయనకు నాలుగో నియోజకవర్గమని .. పవన్ కు నాలుగో భార్య లాగే నాలుగో నియోజకవర్గమంటూ జగన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి పాలకొల్లులో పవన్ ఇప్పటివరకు పోటీ చేయలేదు. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే పవన్ కు పిఠాపురం మూడో నియోజకవర్గం మాత్రమే. గత ఎన్నికల్లో తొలిసారి భీమవరం, గాజువాకలో పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగుతున్నాడు. ఇది జగన్ కు తెలియదా..? లేక ఆయనకు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ లో అలాగే ఉందా..? లేక జగన్ లో భయం మొదలై ఇలా ఏదిపడితే అది మాట్లాడుతున్నాడా..? అని జనసేన శ్రేణులే కాదు వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నారు.

Read Also : NTR : ఎన్టీఆర్ స్టార్‌డమ్ వల్లే.. నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా.. తారక్ ఏం చెప్పాడు..?