Site icon HashtagU Telugu

Tenali : చంద్రబాబు పై జగన్ ఫైర్..ఇది ఎంత వరకు కరెక్ట్ బాబు..?

Jagan Tenali

Jagan Tenali

తెనాలి ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan ) తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తూ, పోలీసుల వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలి(Tenali)లో పోలీసుల చేతిలో చిత్రహింసలు పొందిన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. “కేసులు ఉంటే నడిరోడ్డుపై కొడతారా? అయితే చంద్రబాబుపై ఉన్న 24 కేసుల విషయంలో ఏమంటారు?” అంటూ ప్రభుత్వాన్ని, పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా ఎండగట్టారు.

YS Jagan : తెనాలిలో వైఎస్‌ జ‌గ‌న్‌కు నిర‌స‌న సెగ‌

బాధితుల్లో ఒకరు ప్రస్తుతం హైదరాబాద్‌లో జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. పాత కేసులో వాయిదా కోసం వచ్చిన అతడిని, అతడి స్నేహితులతో కలిసి మంగళగిరి నుంచి తెనాలికి తీసుకువచ్చి హింసించినట్లు ఆరోపించారు. పోలీసులు న్యాయాన్ని పాటించాల్సిన సమయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. నడిరోడ్డుపై కొట్టే హక్కును ఎవరు ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. బాధితుల పరువు పోయిన ఈ ఘటనలో బాధ్యత ఎవరిది? అని నిలదీశారు.

IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్

పరామర్శించిన వ్యక్తులు గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు అంటూ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తెనాలి పర్యటన నేపథ్యంలో రెండు రోజులుగా వైసీపీ-టీడీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం ముదిరింది. అయితే తెనాలిలో దళిత, ప్రజాసంఘాల నిరసనలతో జగన్ పర్యటనకు వ్యతిరేకత ఎదురైంది. గతంలో వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించని జగన్, ఇప్పుడు రౌడీషీటర్లకు మద్దతు తెలపడం దారుణమని ఆందోళనకారులు విమర్శించారు.