విదేశాలకు (foreign ) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan), ఎెంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇక విజయసాయి రెడ్డి పిటిషన్ విచారణలో వాదనలు పూర్తయ్యి, తీర్పును కోర్ట్ ఈ నెల 30కి వాయిదా వేసింది. బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
యూరప్‌లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతించాలంటూ రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందన్నారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకుసాగడంలేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. మరి వీరికి కోర్ట్ అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.
Read Also : Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే బూడిద కాబోతుందా..?