Jagan : స‌ర్కార్ కు ఆర్థిక సంక‌టం,ఉద్యోగుల చెల‌గాటం

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan) ఉద్యోగులు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.నిర‌స‌న

  • Written By:
  • Updated On - April 6, 2023 / 04:32 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan) ప్ర‌భుత్వ ఉద్యోగులు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. వాళ్ల నిర‌స‌న తారాస్థాయికి చేరుతోంది. ఒక్కో స్టెప్ వేస్తూ ప్ర‌భుత్వాన్ని(Governament) ఇరుకున పెట్టే దిశ‌గా వెళుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పరిపాల‌న‌లో పెద్ద‌గా ఉద్యోగుల నిర‌స‌న ప్ర‌భావం పెద్ద‌గా లేదు. కానీ, ఏప్రిల్ 11వ తేదీ నుంచి `మొబైల్ ఫోన్స్ డౌన్ ` ద్వారా ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఫ‌లితంగా ప‌రిపాల‌న మీద తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది.

ప్ర‌భుత్వ ఉద్యోగులు  నిర‌స‌న (Jagan)

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఉద్యోగులు ఏప్రిల్ 8న రాష్ట్రంలోని అన్ని సర్కిళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగుతారు. ఏప్రిల్ 10న మాస్కులు ధరించి స్పందన గ్రీవెన్స్ సెల్‌లో మెమోరాండంలు సమర్పిచనున్నారు. ఏప్రిల్ 11న ఒకరోజు ‘మొబైల్ ఫోన్స్ డౌన్’ ఆందోళన ఉండ‌నుంది. అయితే, ఒక రోజు మాత్ర‌మే ఈ నిర‌స‌న ఉండ‌డం కొంత వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స‌ర్కార్ కు ఊర‌ట‌గా ఉంది. ఇక ఏప్రిల్ 12న రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలకు పూనుకుంటున్నారు. ఏప్రిల్ 18న సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నాలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఉద్యోగులు నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు.

ఉద్యోగులు రెండో విడత నిరసనలు, ఆందోళనలు

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందడం లేదు. దీంతో ఈఎంఐలు చెల్లించ‌లేక‌పోతున్నారు. బ్యాంకులు ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్ద‌ని ఏప్రిల్ 20న ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బ్యాంకుల ఎదుట ధర్నాలు చేయ‌బోతున్నారు. ఏప్రిల్ 25న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా, ఏప్రిల్ 29న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నారు. ఇలా ఏప్రిల్ 29 వరకు ప్రభుత్వ ఉద్యోగులు రెండో విడత నిరసనలు, ఆందోళనలు ఉంటాయ‌ని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఏపీజేఏసీ- అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

ఏ స‌మ‌స్య‌కూ ప‌రిష్కారం చూప‌లేద‌ని ఉద్యోగులు ఆగ్ర‌హం

ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు చెల్లించాల‌ని ఉద్యోగులు ప్ర‌ధ‌మ డిమాండ్ గా ఉంది. సీపీఎస్ ర‌ద్దు, 11వ పీఆర్సీ ప్ర‌తిపాదిత వేత‌నాలు, పెండింగ్ డీఏ బ‌కాయిల చెల్లింపు డిమాండ్ల‌ను సాధించుకోవాల‌ని ఉద్యోగులు పట్టుద‌ల‌గా ఉన్నారు. ఉద్య‌మానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రిటైర్డ్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. తదుపరి దశ ఉద్యమం కొనసాగింపునకు జేఏసీ తీర్మానం చేసింది.

12వ పీఆర్‌సీని ఏర్పాటు చేయ‌డంతో పాటు సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని(Governament) ఉద్యోగులు కోరుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇలా ప‌లు ర‌కాల డిమాండ్ల‌తో కూడిన మొమోరాండం త‌యారు చేసి ప్ర‌భుత్వానికి ఇచ్చారు. ఈ డిమాండ్ల మీద మంత్రి వ‌ర్గం ఉప‌సంఘం ప‌లుమార్లు స‌మావేశం అయింది. కానీ, ఏ స‌మ‌స్య‌కూ ప‌రిష్కారం చూప‌లేద‌ని ఉద్యోగులు ఆగ్ర‌హంగా ఉన్నారు.

Also Read : Employees Ugadi Gift to Jagan: జగన్ కు ఉద్యోగుల ఉగాది ఝలక్

సీపీఎస్ ర‌ద్దు హామీ నెర‌వేర‌ద‌ని ప్ర‌భుత్వం దాదాపుగా తేల్చేసింది. దానికి బ‌దులుగా జీపీఎస్ విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని మంత్రివ‌ర్గ ఉప సంఘం చెప్పింది. ఉద్యోగ సంఘాల‌తో మంత్రివ‌ర్గం ఉప సంఘం నేత‌ల స‌మావేశం అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం శూన్యం. దీంతో ఉద్య‌మం వైపు ఉద్యోగులు దూకుడుగా వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప్ర‌భుత్వం ఉద్యోగుల కోర్కెల‌ను తీర్చ‌డానికి సిద్దంగా లేదు. ఫ‌లితంగా ఏపీ ప్ర‌భుత్వ పాల‌న మీద ప్ర‌తికూల ప్ర‌భావం ఉద్యోగుల రూపంలో ప‌డ‌నుంది.

Also Read : Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!